యాద్రాద్రి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం.. ఏర్పాట్లలో మంత్రి బిజీ

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్‌లోని NTR మినీ స్టేడియంలో ఈ నెల 6న(శనివారం) నిర్వహించే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణోత్సవ ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌ని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజ‌లపై యాదాద్రి ల‌క్ష్మీన‌ర్సింహ స్వామివారి ఆశీస్సులు ఉండాలనే సంక‌ల్పంతో స్వామి వారి క‌ళ్యాణ మ‌హోత్సవం నిర్వహిస్తున్నామ‌న్నారు. స్వామివారి ఉత్సవ విగ్రహాల‌తో క‌న్నుల పండుగ‌గా జ‌రిగే ఈ […]

Update: 2021-11-05 03:12 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్‌లోని NTR మినీ స్టేడియంలో ఈ నెల 6న(శనివారం) నిర్వహించే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణోత్సవ ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌ని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజ‌లపై యాదాద్రి ల‌క్ష్మీన‌ర్సింహ స్వామివారి ఆశీస్సులు ఉండాలనే సంక‌ల్పంతో స్వామి వారి క‌ళ్యాణ మ‌హోత్సవం నిర్వహిస్తున్నామ‌న్నారు.

స్వామివారి ఉత్సవ విగ్రహాల‌తో క‌న్నుల పండుగ‌గా జ‌రిగే ఈ మ‌హాత్కార్యానికి నిర్మల్ జిల్లా ప్రజ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చి, క‌ళ్యాణ మ‌హోత్సవాన్ని తిల‌కించాల‌ని కోరారు. భ‌క్తులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకుని స్వామివారి ఆశీర్వాదం పొందాల‌ని సూచించారు. భ‌క్తులకు ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నామ‌న్నారు.

బంగారు తాపడం కోసం విరాళాలు..

సీఎం కేసీఆర్ పిలుపు మేర‌కు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం ప్రజలు విరాళాలు అందివ్వాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆల‌య పున‌ర్నిర్మాణంలో భాగ‌స్వాములు కావాల‌నుకునే భ‌క్తులు స్వచ్చంద విరాళాలు ఇవ్వవ‌చ్చని సూచించారు.

 

Tags:    

Similar News