15 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్.. ఇండియాలో మొట్టమొదటి ఫోన్
దిశ, వెబ్‌డెస్క్: Xiaomi భారతదేశంలో 2022 సంవత్సరానికి కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. చైనీస్ స్మార్ట్ ఫోన్ సంస్థ వచ్చే ఏడాది Xiaomi 11i హైపర్ చార్జ్ ఫోన్‌ను జనవరి 6న విడుదల చేయనుంది. ఈ ఫోన్ 120W తో రానుంది. దేశంలో 100W కంటే ఎక్కువ ఫాస్ట్ చార్జింగ్‌తో వస్తున్న మొట్టమెుదటి ఫోన్. ఇది కేవలం 15 నిమిషాల్లో 100 శాతం బ్యాటరీని చార్జ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఫీచర్స్ విషయానికి వస్తే ఇది 120Hz […]
దిశ, వెబ్‌డెస్క్: Xiaomi భారతదేశంలో 2022 సంవత్సరానికి కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. చైనీస్ స్మార్ట్ ఫోన్ సంస్థ వచ్చే ఏడాది Xiaomi 11i హైపర్ చార్జ్ ఫోన్‌ను జనవరి 6న విడుదల చేయనుంది. ఈ ఫోన్ 120W తో రానుంది. దేశంలో 100W కంటే ఎక్కువ ఫాస్ట్ చార్జింగ్‌తో వస్తున్న మొట్టమెుదటి ఫోన్. ఇది కేవలం 15 నిమిషాల్లో 100 శాతం బ్యాటరీని చార్జ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.
ఫీచర్స్ విషయానికి వస్తే ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో రూపొందించారు. వెనుక భాగంలో 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా ఫ్రేమ్‌వర్క్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది. డ్యూయల్ JBL ట్యూన్డ్ స్టీరియో స్పీకర్లు, NFC ఉన్నాయి. ఫోన్ ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 920 SoC ద్వారా పనిచేస్తుంది. Xiaomi 11i హైపర్ చార్జ్‌లో ముఖ్యమైన 4,500mAh బ్యాటరీతో 120W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది 0 నుంచి 100 శాతం వరకు కేవలం 15 నిమిషాల్లో చార్జ్ చేస్తుంది. ఈ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. 6GB RAM + 128GB స్టోరేజ్. దీని ధర సుమారు రూ.22,500. 8GB + 128GB వేరియంట్ ధర రూ.24,900. ఇంకొక వేరియంట్ 8GB + 256GB స్టోరేజ్ ధర రూ.27,300.