కరోనా వైరస్ పుట్టుకపై వూహాన్ ల్యాబ్ చీఫ్ స్పందన

లండన్/వుహాన్ : ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందనే విషయం ఇంకా రహస్యంగానే ఉండిపోయింది. రోజుకో అధ్యయనం, పూటకో పరిశోధన బయటకు వస్తున్నా సరే కరోనా మూలాల గురించి మాత్రం ఎవరూ కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నారు. అమెరికా, యూరోప్ దేశాలు కరోనా పుట్టుక గురించి చెప్పిన ప్రతీసారి వూహాన్ ల్యాబ్ వైపే తమ వేళ్ళు చూపిస్తున్నాయి. వూహాన్ ల్యాబ్‌లోనే కరోనా వైరస్ పురుడు పోసుకుందని ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ ఆరోపణలపై వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ […]

Update: 2020-04-28 06:36 GMT

లండన్/వుహాన్ : ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందనే విషయం ఇంకా రహస్యంగానే ఉండిపోయింది. రోజుకో అధ్యయనం, పూటకో పరిశోధన బయటకు వస్తున్నా సరే కరోనా మూలాల గురించి మాత్రం ఎవరూ కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నారు. అమెరికా, యూరోప్ దేశాలు కరోనా పుట్టుక గురించి చెప్పిన ప్రతీసారి వూహాన్ ల్యాబ్ వైపే తమ వేళ్ళు చూపిస్తున్నాయి. వూహాన్ ల్యాబ్‌లోనే కరోనా వైరస్ పురుడు పోసుకుందని ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ ఆరోపణలపై వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) డైరెక్టర్ యువాన్ జిమింగ్ తొలిసారి స్పందించారు. ‘కరోనా వైరస్‌ సృష్టించే సామర్థ్యం, ఉద్దేశం మాకు లేదు. సార్స్-కోవ్-2 వైరస్ యొక్క జినోమ్ మానవ మేథస్సు నుంచి వచ్చిందనే సమాచారం ఎక్కడా లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వ్యాపిస్తున్న అంటువ్యాదుల్లో 70 శాతం జంతువుల నుంచే సంక్రమిస్తున్నాయి’ అయి యువాన్ అన్నారు. కరోనా వైరస్ సంబంధించి వూహాన్ ల్యాబ్‌పై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఆయన రాయ్‌టర్స్ వార్త సంస్థకు లిఖిత పూర్వక లేఖను పంపించారు. గత కొన్నేండ్లుగా మానవులు, అటవీ జంతువుల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. వీటికి తోడు అంతర్జాతీయంగా వస్తోన్న వాతావరణ మార్పుల వల్ల కూడా వైరస్ ముప్పులు పెరుగుతున్నాయి. ఇవన్నీ మనం గుర్తిస్తూనే ఉన్నాం. అయినా సరే కరోనా అభాండాన్ని చైనాపై నెట్టేయడం భావ్యం కాదని యువాన్ లేఖలో పేర్కొన్నారు. పరిశోధనల కోసం గబ్బిలాల్లో పెంచిన వైరస్‌ను ల్యాబ్ అనుకోకుండా లీక్ చేసింది అనే వాదనను కూడా ఆయన కొట్టిపారేశారు. వూహాన్ ల్యాబ్ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు కలిగి ఉందని ఆయన స్పష్టం చేశారు. అంటువ్యాధులు ప్రబలిన ప్రతీసారి వైరస్ పుట్టుకపై శాస్త్రవేత్తల మధ్య ఇలాంటి వాదోపవాదాలు చోటు చేసుకోవడం సాధారణ విషయమేనని యువాన్ అంటున్నారు. వైరస్ మూలాలను కనుగొనడం సవాళ్లతో కూడుకున్న వ్యవహారమని.. దీనిపై అనిశ్చితి ఎన్నటికీ కొనసాగుతూనే ఉంటుందని యువాన్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలు తమ అనుమానాలు, పక్షపాతాలను పక్కన పెట్టి హేతుబద్దతతో దర్యాప్తు జరిపితే వూహాన్ ల్యాబ్ తప్పకుండా సహకరిస్తుందని యువాన్ స్పష్టం చేశారు.

Tags : Wuhan, Virology Lab, Dirtector, Coronvirus, Covid 19, Yuvan Zhiming, Origin

Tags:    

Similar News