సుశీల్ కుమార్ పిటిషన్ కొట్టివేత.. జైల్లో పెట్టిందే తినాలని ఆదేశం
దిశ, స్పోర్ట్స్: స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ తనకు ప్రత్యేక ఆహారం అందించాలని వేసిన పిటిషన్‌ను ఢిల్లీలోని రోహిణి కోర్టు కొట్టేసింది. యువ రెజ్లర్ సాగర్ దండక్ హత్య కేసులో ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సుశీల్.. గత వారం తనకు అథ్లెట్లకు అందించే ప్రత్యేమైన ఆహారాన్ని అందించాలని పిటిషన్ దాఖలు చేశాడు. తనను తప్పుడు కేసులో ఇరికించారని.. ఒలింపిక్ పతక విజేతనైన తాను ఇంకా రెజ్లర్‌గా కొనసాగుతున్నందున సరైన డైట్ అవసరమని పిటిషన్‌లో కోరాడు. జైల్లో […]
దిశ, స్పోర్ట్స్: స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ తనకు ప్రత్యేక ఆహారం అందించాలని వేసిన పిటిషన్‌ను ఢిల్లీలోని రోహిణి కోర్టు కొట్టేసింది. యువ రెజ్లర్ సాగర్ దండక్ హత్య కేసులో ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సుశీల్.. గత వారం తనకు అథ్లెట్లకు అందించే ప్రత్యేమైన ఆహారాన్ని అందించాలని పిటిషన్ దాఖలు చేశాడు. తనను తప్పుడు కేసులో ఇరికించారని.. ఒలింపిక్ పతక విజేతనైన తాను ఇంకా రెజ్లర్‌గా కొనసాగుతున్నందున సరైన డైట్ అవసరమని పిటిషన్‌లో కోరాడు.
జైల్లో అందించే ఆహారంతో తనకు సరైన ప్రొటీన్స్ అందడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు. అయితే సునిల్ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన కోర్టు.. జైలు నిబంధనల ప్రకారం అందిస్తున్న ఆహారంలో తనకు సమస్యలు ఉన్నట్లు పేర్కొనలేదని, కేవలం అదనపు ఆహారం మాత్రమే కోరుతున్నాడని కోర్టు వ్యాఖ్యానించింది. ఇది నిబంధనలకు విరుద్దం కనుక పిటిషన్ కొట్టేస్తున్నామని, జైలులో ఉండే ఖైదీలందరికీ ఒకే రకమైన మెనూ ఉంటుందని పేర్కొన్నది.