‘కన్నప్ప’ నుంచి బిగ్ బాస్ విన్నర్ పోస్టర్ రిలీజ్.. కుమారదేవ శాస్త్రి ఫస్ట్ లుక్ రిలీజ్(పోస్ట్)
హీరో విష్ణు మంచు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘కన్నప్ప’(Kannappa).

దిశ, వెబ్‌డెస్క్: హీరో విష్ణు మంచు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘కన్నప్ప’(Kannappa). ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న మూవీని.. అవా ఎంటర్‌టైన్మెంట్స్(Ava Entertainments), 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్(Mohanlal), అక్షయ్ కుమార్(Akshay Kumar), ప్రభాస్, శరత్ కుమార్ వంటి స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా ఈ మూవీ ఏప్రిల్ 25న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక విడుదల సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ప్రతి సోమవారం ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీనీ పెంచుతున్నారు. ఇందులో భాగంగా నిన్న(సోమవారం) ఓ టాలీవుడ్ యాక్టర్, తెలుగు బిగ్ బాస్ సీజన్-1 విన్నర్ పాత్రను పరిచయం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అతని ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
కన్నప్ప సినిమాలో శివ బాలాజీ(Shiva Balaji) కుమార దేవ శాస్త్రి పాత్రను పోషించారు. ఈ క్యారెక్టర్‌ను రివీల్ చేస్తూ వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక పోస్టర్‌లో శివ బాలాజీ.. ఓ ముని వేషంలో కనిపిస్తున్నారు. అలాగే చేతితో పండ్ల బుట్ట పట్టుకుని, మెడలో చేతులకు రుద్రాక్ష మాలలు కట్టుకుని దర్శనమిచ్చాడు. ప్రస్తుతం ఎంతో నేచురల్ లుక్‌లో ఉన్న శివ బాలాజీ లుక్ సినిమాపై మరింత హైప్ పెంచుతోంది.