వరల్డ్ స్ట్రాంగెస్ట్ జిన్.. ‘అన్నో ఎక్స్‌ట్రీమ్ 95’

దిశ, వెబ్‌డెస్క్ :  మందుబాబులకు యూకేకు చెందిన ‘అన్నో డిస్టిల్లర్స్’ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. క్రిస్మస్ పండుగ వస్తున్న సందర్భంగా ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ జిన్‌ను తయారు చేసి, ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఆల్కహాల్ పర్సంటేజ్ అతి ఎక్కువగా ఉండే ఆ జిన్‌ను నేరుగా తాగొచ్చా? అసలు దాన్ని ఎలా తాగాలి? ఎవరు రూపొందించారు? ఇటీవలి కాలంలో పలు లిక్కర్ కంపెనీలు.. ఆల్కహాల్ వెర్షన్స్ లేదా నో ఆల్కహాల్ బేవరేజ్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో […]

Update: 2020-12-03 04:40 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మందుబాబులకు యూకేకు చెందిన ‘అన్నో డిస్టిల్లర్స్’ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. క్రిస్మస్ పండుగ వస్తున్న సందర్భంగా ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ జిన్‌ను తయారు చేసి, ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఆల్కహాల్ పర్సంటేజ్ అతి ఎక్కువగా ఉండే ఆ జిన్‌ను నేరుగా తాగొచ్చా? అసలు దాన్ని ఎలా తాగాలి? ఎవరు రూపొందించారు?

ఇటీవలి కాలంలో పలు లిక్కర్ కంపెనీలు.. ఆల్కహాల్ వెర్షన్స్ లేదా నో ఆల్కహాల్ బేవరేజ్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో ‘అన్నో ఎక్స్‌ట్రీమ్ 95 జిన్’ మాత్రం 95 శాతం ఆల్కహాల్‌ వాల్యూమ్‌తో ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ జిన్‌గా మార్కెట్‌లో రిలీజ్ అయింది. బంచ్ ఆఫ్ బొటానికల్స్‌తో తయారైన ఈ జిన్‌లో.. ‘ఫెన్నెల్, కొరియాండర్, నట్‌మెగ్, లికోరైస్’ వంటి సుగంధ ద్రవ్యాలను కూడా ఉపయోగించారు. ‘చాలా సాఫ్ట్ అండ్ స్వీట్ టేస్ట్‌ అందిస్తూనే, ఘాటును పంచుతూ లాంగ్ లాస్టింగ్ ఫీల్‌ను అందిస్తుంది’ అని జిన్ టేస్టర్స్ తెలుపుతున్నారు. అయితే ఈ జిన్‌ను నేరుగా తీసుకుంటే మాత్రం మూతి కాలిపోయే ప్రమాదముంది. అంతేకాకుండా ఈ జిన్‌ను కేవలం 5 ఎంఎల్ తీసుకుంటే చాలు.. కావాల్సినంత కిక్ వస్తుందని తయారీదారులు వెల్లడించారు. 200 ఎంఎల్ కలిగిన ఈ జిన్ బాటిల్ ఓ ప్రజెంటేషన్ బాక్స్‌లో, 25 ఎంఎల్ సైంటిఫిక్ మెజరింగ్ బీకర్‌తో కలిపి వస్తుండటం విశేషం.

‘స్వతహాగా శాస్ర్తవేత్తలైన బ్రిటన్ దంపతులు ఈ జిన్ తయారుచేశారు. ‘ద స్పిరిట్ ఆఫ్ ఆల్కెమీ’‌ను క్రియేట్ చేయడం కోసమే దీన్ని రూపొందించినట్లు సదరు శాస్త్రవేత్తలు తెలిపారు. బొట్టు బొట్టులోనూ జిన్ టేస్ట్ పంచ్ అండ్ ఫ్లేవర్ ఉంటాయని, ప్రపంచంలో ఏ ఇతర స్పిరిట్ కూడా ఇలా ఉండదని ఆ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్వీడన్‌కు చెందిన స్ట్రానే అనే లిక్కర్ కంపెనీ రూపొందించిన ఆల్ట్రా అన్‌కట్ 82 శాతం ఆల్కహాల్ పర్సెంటేజ్‌తో ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ జి‌న్‌గా పేరుపొందగా, దాని రికార్డ్‌ను ‘అన్నో ఎక్స్‌ట్రీమ్ 95’ తాజాగా బ్రేక్ చేసింది.

Tags:    

Similar News