అబార్షన్ మాత్రలను నిషేధించిన మొదటి రాష్ట్రం
అమెరికా దేశంలో అబార్షన్ మాత్రల వాడకాన్ని నిషేధించిన మొదటి రాష్ట్రాంగా వ్యోమింగ్ నిలిచింది.
దిశ, వెబ్డెస్క్: అమెరికా దేశంలో అబార్షన్ మాత్రల వాడకాన్ని నిషేధించిన మొదటి రాష్ట్రాంగా వ్యోమింగ్ నిలిచింది. శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంటు వ్యోమింగ్ రాష్ట్రం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కాగా ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఆరు నెలల వరకు జైలు శిక్ష, అలాగే $9,000 వరకు జరిమానా విధించనున్నట్లు అధికారులు హెచ్చరించారు.