Ukraine Crisis: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో బ్రిటన్ పౌరుడు..!
రష్యా- ఉక్రెయిన్ (Russia-Ukraine War)ల మధ్య యుద్ధం తీవ్రతరం అయ్యింది. మాస్కోకు అండగా నార్త్ కొరియా(North Korea) సైనిక సాయం అందిస్తోంది.
దిశ, నేషనల్ బ్యూరో: రష్యా- ఉక్రెయిన్ (Russia-Ukraine War)ల మధ్య యుద్ధం తీవ్రతరం అయ్యింది. మాస్కోకు అండగా నార్త్ కొరియా(North Korea) సైనిక సాయం అందిస్తోంది. ఉక్రెయిన్ తరఫున బ్రిటన్ రంగంలోకి దిగింది. కీవ్ తరఫున యుద్ధం చేస్తున్న ఓ బ్రిటన్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రష్యా బలగాలు తెలిపాయి. బ్రిటన్‌కు చెందిన జేమ్స్ స్కాట్ రైస్ ఆండర్సన్ అనే వ్యక్తి సైనిక దుస్తులు ధరించి, ఉక్రెయిన్ తరఫున యుద్ధంలో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. గతంలో అతడు బ్రిటిష్ సైన్యంలో పని చేశాడన్నారు. అండర్సన్ కి సంబంధించిన వీడియోను విడుదల చేశారు.
స్పందించిన బ్రిటన్
కాగా, క్రెమ్లిన్ ఆరోపణలపై బ్రిటిష్ విదేశాంగ కార్యాలయం స్పందించింది. తమ దేశానికి చెందిన పౌరుడిని రష్యా అధికారులు నిర్బంధించారని తెలిపింది. బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామంది. ఇప్పటికే ఉత్తరకొరియా 10 వేల మందికి పైగా సైనికులను రష్యాకు పంపింది. అయితే, ఇప్పుడు మరోసారి ఆయుధాలు పంపినట్లు కూడా చెప్పింది. కాగా.. దాదాపు వెయ్యిరోజులుగా రష్యా- ఉక్రెయిన్ యుద్దం కొనసాగుతోంది. ఇక, దీర్ఘశ్రేణి క్షిపణులను మాస్కోపై ప్రయోగించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌కు అనుమతి ఇచ్చారు. దీంతో అమెరికా (America) తయారుచేసిన ఏటీఏసీఎంఎస్ క్షిపణులను ఉక్రెయిన్ మాస్కోపై ప్రయోగించింది. కిమ్ సైన్యం రష్యాకు సైనికులు, ఆయుధాలను సరఫరా చేస్తుడటంతోనే.. బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అణ్వస్త్ర ప్రయోగానికి మార్గం సుగమం చేసేలా కీలక పత్రాలపై సంతకం చేశారు. దీంతోపాటు ఉక్రెయిన్‌కు (Ukraine) సహకరించే దేశాలను యుద్ధంలో తమ ప్రత్యర్థులుగానే భావిస్తామని ప్రపంచ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు.