ప్రపంచంలోనే అతిపెద్ద 'జాఫా' కేక్ తయారీ.. ఆ ప్రోగ్రామ్‌లో పంచారు!!
2017లోని తన సొంత గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బ్రేక్ చేశారు క్విన్. World's largest Jaffa Cake unveiled.
దిశ, వెబ్‌డెస్క్ః జాఫా అనగానే తెలుగు కమీడియన్ బ్రహ్మానందం డైలాగ్ 'జఫ్ఫా' గుర్తుకురావొచ్చుకానీ, ఇది అది కానేకాదు. ఎంతో రుచికరమైన జాఫా కేక్ ఇది. మాజీ గ్రేట్ బ్రిటీష్ బేక్ ఆఫ్ విజేత అయిన ఫ్రాన్సిస్ క్విన్ తాజాగా 80 కిలోల బరువున్న ప్రపంచంలోనే అతిపెద్ద జాఫా కేక్‌ను తయారుచేశారు. 6,557 కంటే ఎక్కువ రెగ్యులర్ సైజ్ జఫ్ఫా కేక్‌లకు సమానమైన ఈ కేకు, 175 సెం.మీ వ్యాసంతో రూపొందించి, 2017లోని తన సొంత గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బ్రేక్ చేశారు క్విన్. అయితే, ఈ కేకును బ్రిటన్స్ గాట్ టాలెంట్ 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తయారుచేయడం విశేషం. దీని కోసం 160 కంటే ఎక్కువ గుడ్లు, 8 కిలోల డార్క్ చాక్లెట్, 15 కిలోల నారింజ జెల్లీని వాడారు. బకింగ్‌హామ్‌షైర్‌లోని హై వైకోంబ్‌లోని మెక్‌విటీ ఇన్నోవేషన్ బేకరీలో 11 గంటల కంటే ఎక్కువ సమయం కష్టపడి, ఈ ప్రక్రియను పూర్తిచేశారు. వెస్ట్ లండన్‌లోని హామర్స్‌మిత్‌లోని ఈవెంట్‌టిమ్ అపోలో వెలుపల బ్రిటన్స్ గాట్ టాలెంట్ లైవ్ సెమీ-ఫైనల్స్‌లో 300 సేర్విన్గ్‌లతో జఫ్ఫా కేక్ అతిథులకు, సిబ్బందికి అందించారు.