ఇంటికి పిలిచి, భోజనంపెట్టి, దానికి డబ్బులు కట్టమన్న ఫ్రెండ్! మమ్మల్నీ అడిగారంటున్న నెటిజన్లు!!
అలాగని, వాటన్నింటికీ ఎవరైనా డబ్బులు వసూలు చేస్తారా..?! invited to friend's house for dinner then charged for it.
దిశ, వెబ్‌డెస్క్ః స్నేహితులు మధ్య ఇచ్చిపుచ్చుకోవాడాలు, పండగలకీ పబ్బాలకు ఒకర్ని ఒకరు ఆహ్వానించుకొని భోజనం ఆఫర్ చేయడాలు చాలా సహజం. అంతేందుకు, ఇంట్లో ఏదైనా స్పెషల్ వండితే స్నేహితుల ఇంటికి తీసుకెళ్లి కూడా ఇస్తుంటారు. అలాగని, వాటన్నింటికీ ఎవరైనా డబ్బులు వసూలు చేస్తారా..?! మరీ వింత కాకపోతే, ఓ మహిళను తన ఫ్రెండ్ ఇంటికి పిలిచి, సరదాగా కబుర్లు చెప్పుకొని భోజనం చేసిన తర్వాత దాని బిల్లు టేబుల్ మీద పెట్టారంట!!
అంబర్ నెల్సన్ అనే మహిళ తనకు జరిగిన ఈ ఘోర అవమానాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఒక ఫ్రెండ్ డిన్నర్‌కి పిలిచి, 20 డాలర్లు, అంటే రూ. 1,500 చెల్లించమని బిల్లు చేతికిచ్చారంట. ఇంట్లో వండిన 'పెన్నే అల్లా వోడ్కా'ని రెండు 'సేర్విన్గ్స్' ఆఫర్ చేసి, ఇలా చేయడంతో అంబర్ షాక్‌కి గురయ్యింది. ఈ దెబ్బతో ."భవిష్యత్తులో ఎవరు భోజనానికి రమ్మన్నా వెళ్లను." అని అంబర్ తెగ బాధపడిపతోంది. అంబర్ ట్వీట్‌ని చూసిన నెటిజన్లు ఎవరీ వింత జీవి అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.
కొందరైతే, ఇదేమీ కొత్త విషయం కాదనీ, ఇలాంటిది నాకు జరిగిందంటూ మరొకరు తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇంకోవ్యక్తి, తన ఫ్రెండ్ డిన్నర్‌కి పిలిచిందని వెళితే, నేను నా సొంత మద్యం తీసుకెళ్లలేదని భోజనం ఆఫర్ చేయలేదని చెప్పాడు. ఇలా... ఒకొక్కరూ తమ అనుభవాలను పంచుకుంటూ ఈ ట్విట్టర్ టాక్ వైరల్‌గా మారింది.
Got invited to someone's place for dinner and they charged me for it….this is weird, right?
— Amber Nelson (@AmberSmelson) March 10, 2022
This makes me not want to accept offerings in the future
— Amber Nelson (@AmberSmelson) March 10, 2022