ఉక్రెయిన్ సంక్షోభంలో శాంతి ప్రక్రియకే మద్దతు: ప్రధాని మోడీ
ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించే ఎలాంటి శాంతి ప్రక్రియలో నైనా భారత్ చేరుతుందని అన్నారు.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించే ఎలాంటి శాంతి ప్రక్రియలో నైనా భారత్ చేరుతుందని అన్నారు. శనివారం జర్మనీ ఛాన్సిలర్ ఒలఫ్ స్కోల్జ్‌కు ఆయన స్వాగతం పలికారు. సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ఐక్యరాజ్యసమితి మండలిలో సంస్కరణలు అవసరమని ఆయన కోరారు. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్ సంక్షోభం ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయని మోడీ చెప్పారు.
అభివృద్ధి చెందిన దేశాలు ప్రతికూలంగా ప్రభావితం చెందాయని తెలిపారు. అయితే ఉక్రెయిన్ సంక్షోభాన్ని ఆపడంలో శాంతి పూర్వక చర్చలకే తమ మద్దతు ఇస్తామని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ వివాదం ప్రభావం వల్ల ప్రపంచం అల్లాడిపోతోందని, ఈయూ-భారత్ స్వేచ్ఛా వాణిజ్యం కోసం చర్చలు త్వరగా పూర్తయ్యేలా తాను వ్యక్తిగతంగా సహాయం చేస్తానని చెప్పారు.
తమకు ఉక్రెయిన్ ఎప్పుడూ ప్రధానమైన అంశమని అన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రధాన రంగాలపై ప్రభావం చూపిందని చెప్పారు. భారత్ యూరోపియన్ యూనియన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగదీయకండా త్వరగా పూర్తయ్యేలా వ్యక్తిగతంగా నిర్ధారించుకుంటామని చెప్పారు. భారత్ అనేక వనరులకు నెలవని అన్నారు. పరస్పర సహకారంతో ప్రయోజనాలు పొందుతామని తెలిపారు.