ఆ రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదా.. రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ మరో రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదా..

Update: 2023-03-06 09:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ మరో రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదా.. తైవాన్ రక్షణ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరేలా ఉండటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఏడాది చైనా ఏ క్షణమైనా తమ భూభాగంలోకి చొరబడే ప్రమాదం ఉందని తైవాన్ రక్షణ మంత్రి చూ- కూ- చెంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జలసంధి సమీపంలో ఘర్షణ వాతావరణంతో ఈ పరిస్థితి నెలకొన్న వేళ తైవాన్ చుట్టుపక్కల ఇటీవల కాలంలో చైనా ఆర్మీ కదలికలు బాగా పెరిగాయి.

చైనా విమానాలు సైతం రోజు వారీగా తైవాన్ సమీపంలోకి వస్తుండటంతో ఆందోళన నెలకొంది. ఈ సందర్భంగా తైవాన్ పార్లమెంట్ లో ఆ దేశ రక్షణ మంత్రి చెంగ్ మాట్లాడారు. తైవాన్ సమీపంలోని జలాలు, గగనతలంలోకి రావడానికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సాకులు వెతుకుతుందన్నారు. ఇటీవల తైవాన్ - అమెరికా సైనిక సహకారం పెరగడం కూడా ఇందుకు కారణమన్నారు. చైనా ఆర్మీ ఏ క్షణమైనా తైవాన్ భూభాగంలోకి చేరవచ్చన్నారు.

చైనా సన్నాహాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయన్నారు. చైనా తమ భూభాగంలోకి వస్తే ఊపేక్షించబోమని ఖచ్చితంగా ఎదురుదాడికి దిగుతామని తైవాన్ స్పష్టం చేసింది. చైనా ప్రీమియర్ లీక్వికియాంగ్ ఆదివారం మాట్లాడుతూ.. తైవాన్ తో సంబంధాలను తాము ప్రమోట్ చేస్తూనే.. శాంతియుత వీలినాన్ని ముందుకు తీసుకెళతామన్నారు. అదే సమయంలో తైవాన్ స్వాతంత్యాన్ని వ్యతిరేకిస్తామన్నారు. ఈ మాటలు చైనాపై తైవాన్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరేలా ఉండటంతో ఏం కాబోతుందోనన్న ఆందోళన నెలకొంది. 

Tags:    

Similar News