USA : అమెరికాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఎప్పుడంటే..?

భారతదేశవ్యాప్తంగా రాబోయే పంద్రాగస్టున స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరగనున్నాయి.

Update: 2024-08-11 05:16 GMT

దిశ, వెబ్‌డెస్క్ : భారతదేశవ్యాప్తంగా రాబోయే పంద్రాగస్టున స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరగనున్నాయి. అయితే అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ నెల 17, 18 తేదీలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయని తెలుస్తోంది. ఉత్తర కాలిఫోర్నియాకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ గ్లోబ్ (FOG) ,ఫెడరేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (FIA) సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో భారతదేశం-యుఎస్ఏ సాంస్కృతిక వారసత్వం ఉట్టిపడేటట్టుగా ఘనంగా ఈ వేడుకలు ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు. ఈ వేడుకల్లో ఇండియా డే పరేడ్, వెల్‌నెస్‌ఫెయిర్‌లు ఉంటాయని, వేలాది మంది ఈ పరేడ్ లో పాల్గొననున్నారని ఎఫ్‌ఓజీ వ్యవస్థాపకుడు, కన్వీనర్ డాక్టర్ రోమేష్ జప్రా తెలిపారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఫుడ్‌ ఫెస్టివల్‌, చిన్నారులను ఉత్సాహపరిచే కార్యక్రమాలు, కవాతు నిర్వహించనున్నారు.

ఈ వేడుకల్లో 250కి పైగా నృత్య బృందాలు తమ కళలను ప్రదర్శించనున్నాయి. ఫోక్, క్లాసికల్,బాలీవుడ్, హిప్-హాప్ వంటి తదితర కేటగిరీలలో ఈ ప్రదర్శనలు జరగనున్నాయని రోమేష్ తెలిపారు. ఎఫ్‌ఓజీ కన్వీనర్ డాక్టర్ రోమేష్ జప్రా మాట్లాడుతూ.. "ఈ వేడుకల్లో బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా పాల్గొననున్నారని, అమెరికాలో మూడు దశాబ్దాలుగా తమ ఫెడరేషన్ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నదని వెల్లడించారు.  


Similar News