16 ఏళ్ల విద్యార్థితో టీచర్ అక్రమ సంబంధం

మిస్సౌరీ రాష్ట్రంలో 16 ఏళ్ల విద్యార్థితో మహిళా టీచర్ శృంగారం చేసిన ఆరోపణలతో అరెస్ట్

Update: 2024-01-11 13:30 GMT
16 ఏళ్ల విద్యార్థితో టీచర్ అక్రమ సంబంధం
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల మహిళా టీచర్ల అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. విద్యార్థులకు చదువు చెప్పే నెపంతో వారితో శృంగార సంబంధాలు పెట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని మిస్సౌరీ రాష్ట్రంలో 16 ఏళ్ల విద్యార్థితో మహిళా టీచర్ శృంగారం చేసిన ఆరోపణలతో అరెస్ట్ అయింది. తోటి విద్యార్థే వీరి సంబంధాన్ని బయటపెట్టాడు. ఈ వ్యవహారంలో మహిళా టీచర్‌తో పాటు విద్యార్థి లైంగిక సంబంధానికి అండగా నిలిచిన కారణంగా అతని తండ్రిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మిస్సౌరీలోని లాకీ హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న హేలీ అనే టీచర్ తన స్టూడెంట్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యవహారం స్కూల్ రిసోర్స్ ఆఫీసర్‌కి తెలిసింది. అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకొచ్చింది. హేలీ ఇటీవలే తన భర్తతో విడాకులు తీసుకున్నట్టు సమాచారం. ఆమెతో సంబంధం పెట్టుకున్నందుకు హేలీ విద్యార్థికి అసైన్‌మెంట్లలో 100 శాతం మార్కులు వేస్తూ వచ్చినట్టు తోటి విద్యార్థి చెప్పాడు. మొదట హేలీ ఈ ఆరోపణలను ఖండించగా, వారి మొబైల్‌లో ఫోటోలు బయటపడటంతో ఆమె పారిపోయేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News