US President Elections: కమలా హారిస్ కే మా పూర్తి మద్దత్తు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడి

అగ్రరాజ్యం అమెరికా(USA)లో మరో రెండు నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-06 23:31 GMT

దిశ, వెబ్‌డెస్క్:అగ్రరాజ్యం అమెరికా(USA)లో మరో రెండు నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా(Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) స్పందించారు. గురువారం రష్యాలోని వ్లాదివోస్టోక్(Vladivostok) లో జరిగిన ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్(Eastern Economic Forum) కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడారు.ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడూతూ అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్(Democratic) పార్టీ అభ్యర్థి కమలా హారిస్(Kamala Harris)కే తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) తమకు ఫేవరెట్ అని, కానీ ఈ ఎన్నికల పోటీ నుంచి బైడెన్ తప్పుకోవడంతో అతను సూచించిన కమలా హారిస్ కు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నామని పుతిన్ నవ్వుతూ చెప్పాడు.అలాగే రిపబ్లికన్(Republican) అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రష్యాపై విధించిన ఆంక్షలను కూడా మర్చిపోబోమన్నారు.

ఆమె నవ్వు ఇన్ఫెక్షియస్(Infectious)..

కమలా హారిస్ నవ్వును పుతిన్ ప్రశంసించారు. ఆమె అందంగా నవ్వుతారని, ఆమె నవ్వు అద్భుతంగా ఉందని,ఆమె నవ్వును బట్టి చూస్తే పరిస్థితి అంతా బావుందని అర్థమయితుందని పుతిన్ కామెంట్ చేశారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆమె బాగా రాణిస్తోందనడానికి ఆమె నవ్వు ఒక నిదర్శనమని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను గురువారం పలు మీడియా ఛానళ్లు షేర్ చేశాయి.

ట్రంప్ రష్యా వ్యతిరేకి..

ట్రంప్(trump) రష్యా వ్యతిరేకి అని, ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, ఏ అధ్యక్షుడు విధించని విధంగా రష్యాపై చాలా ఆంక్షలు విధించారని పుతిన్ విమర్శించారు.రాబోయే ఎన్నికల్లో కమలా హారిస్ (Kamala Harris) గెలిస్తే ఇలాంటి చర్యలేవి తీసుకోరని భావిస్తున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కమలా హారిస్ ఇలాంటి చర్యలకు దూరంగా ఉంటారని అనుకుంటున్నానన్నారు. అయితే,అంతిమంగా ప్రెసిడెంట్ ఎంపిక అమెరికన్ ప్రజలపై ఆధారపడి ఉందని, వారు ఎవరిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నఆ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని పుతిన్ అన్నారు.

పుతిన్ పై అమెరికా విమర్శలు..

కాగా వ్లాదిమిర్ పుతిన్  తాజాగా చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధికారులు తీవ్రంగా స్పందించారుపుతిన్ వ్యాఖ్యలపై US జాతీయ భద్రతా మండలి(National Security Council) ప్రతినిధి జాన్ కిర్బీ(John Kirby) స్పందిస్తూ.. 'మా ఎన్నికల గురించి మాట్లాడటం పుతిన్ మానుకోవాలి'' అన్నారు. పుతిన్ ఎవరికీ అనుకూలంగా ఉండకూడదని, అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరో నిర్ణయించాల్సింది అమెరికా ప్రజలేనని అన్నారు.




Similar News