US Elections : కమలా హారీస్ కు బిగ్ షాక్.. ట్రంప్ కు మద్దత్తు ఇవ్వబోతున్నరాబర్ట్ F. కెన్నెడీ..!

ఈ సంవత్సరం నవంబర్ లో అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-08-21 21:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ సంవత్సరం నవంబర్ లో అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో పోటీచేయడానికి రాబర్ట్ F. కెన్నెడీ (Robert F Kennedy) కొన్ని రోజుల కింద స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తాజాగా రాబర్ట్ F. కెన్నెడీ తన నామినేషన్ వెనక్కి తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.అధ్యక్ష రేసు నుంచి తప్పుకొని రిపబ్లికన్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇవ్వాలని రాబర్ట్ F. కెన్నెడీ యోచిస్తున్నట్లు ABC న్యూస్ బుధవారం పేర్కొంది.శుక్రవారం అరిజోనాలో రాబర్ట్ F. కెన్నెడీ దేశాన్ని ఉద్దేశించి చేసే ప్రసంగంలో తన భవిష్యత్ ప్రణాళిక గురించి తెలియజేస్తాడని కెన్నెడీ యొక్క ప్రచార బృందం తెలిపింది.

కాగా 70 ఏళ్ల రాబర్ట్ F. కెన్నెడీ దివంగత డెమొక్రాటిక్ రాజకీయ నాయకుడు రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ కుమారుడు అలాగే దివంగత అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ మేనల్లుడు. కెన్నెడీ ప్రచార బృందంలో సభ్యుడైన నికోల్ షానహన్ మాట్లాడుతూ.. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న ట్రంప్‌తో చేతులు కలపడానికి రాబర్ట్ F. కెన్నెడీ ఆసక్తితో ఎదురుస్తున్నారని తెలిపారు. ఇదిలా ఉంటె..రాబర్ట్ F. కెన్నెడీ స్వతంత్ర అభ్యర్థి రేసు నుండి తప్పుకుని నాకు మద్దత్తు తెలిపితే గెలిచినా తరువాత తన ప్రభుత్వంలో రాబర్ట్ F. కెన్నెడీకి ముఖ్యమైన పదవిస్తానని ట్రంప్ CNN కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు.

Tags:    

Similar News