రష్యా ఆస్తులు లాక్.. అమెరికా, ఈయూ మాస్టర్ ప్లాన్

దిశ, నేషనల్ బ్యూరో : ఉక్రెయిన్‌పై సైనిక దాడి చేసినందుకు రష్యా పరిహారాన్ని చెల్లించే వరకు.. ఆ దేశపు ఆస్తులను లాక్​ చేయాలని అమెరికా, యురోపియన్ యూనియన్ (ఈయూ) అంగీకరించాయి.

Update: 2024-06-13 18:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఉక్రెయిన్‌పై సైనిక దాడి చేసినందుకు రష్యా పరిహారాన్ని చెల్లించే వరకు.. ఆ దేశపు ఆస్తులను లాక్​ చేయాలని అమెరికా, యురోపియన్ యూనియన్ (ఈయూ) అంగీకరించాయి. ఈ మేరకు అమెరికా సీనియర్ అధికారి ఒకరు గురువారం ప్రకటన విడుదల చేశారు. దీంతోపాటు ఇటలీలో జరుగనున్న జీ7 సదస్సు వేదికగా ఉక్రెయిన్​కు రూ.4 లక్షల కోట్ల (50 బిలియన్ డాలర్ల) లోన్​ ప్యాకేజీని ప్రకటించేందుకు కూటమిలోని దేశాల నేతలకు మార్గం సుగమమైంది. అమెరికా, ఈయూ పరిధిలో రష్యాకు దాదాపు రూ.21 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని అంచనా. వీటిలో ఎక్కువ భాగంగా ఈయూ దేశాల పరిధిలోనే ఉన్నాయి. వాటిని సీజ్ చేసి, ఆయా ఆస్తులపై వచ్చే వడ్డీ, ఇతర ఆదాయాలను పూచీకత్తుగా పరిగణించి.. ఉక్రెయిన్‌కు రూ.4 లక్షల కోట్ల లోన్‌ను ఇవ్వాలని అమెరికా, ఈయూ దేశాలు సంయుక్తంగా నిర్ణయించారు. కాగ, జీ7 దేశాల వార్షిక సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సాయంత్రమే ఇటలీకి బయలుదేరి వెళ్లారు.


Similar News