Musk: ట్రంప్ అధికారంలోకి వస్తే 2 ట్రిలియన్ డాలర్లు ఆదా చేయొచ్చు- మస్క్

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గురించి టెస్లా అధినేత మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-28 08:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గురించి టెస్లా అధినేత మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్(Donald Trump) అధికారంలోకి వస్తే 2 ట్రిలియన్ డాలర్లు (రూ.168 లక్షల కోట్లు) ఆదా చేయొచ్చని టెస్లా అధినేత మస్క్‌(Elon Musk) అన్నారు. బైడెన్‌ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఫెడరల్ బడ్జెట్‌లో అనవసర ఖర్చులు ఉన్నాయని అన్నారు. ట్రంప్ అధికారంలోకి వస్తే ఎలాన్‌ మస్క్‌ను కొత్త ప్రభుత్వ పార్లమెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియన్సీ విభాగానికి అధిపతిగా నియమించనున్నట్లు కాంటర్ ఫిట్జ్‌గెరాల్డ్ ఛైర్మన్ హోవార్డ్ లుట్నిక్ ప్రకటించారు. అందులో భాగంగానే భారీగా డబ్బు ఆదా చేయొచ్చని తెలిపారు. ఖర్చులన్నీ ప్రజల నుంచి వసూలుచేస్తున్న ప్రత్యక్ష, పరోక్ష పన్నులే అన్నారు. దీనిద్వారా దేశ ప్రజల డబ్బే వృథా అవుతోందని గుర్తుచేశారు. ట్రంప్ ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరిస్తుందని.. దీంతో అమెరికా మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు.

ట్రంప్ కు మద్దతుగా మస్క్

ఇకపోతే, ట్రంప్ మద్దతుదారులు తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో పాటు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని మస్క్ పిలుపునిచ్చారు. ట్రంప్‌ (Donald Trump) ప్రచారానికి మస్క్ (Elon Musk) మద్దతివ్వడమే కాకుండా పెద్దమొత్తంలో విరాళాలు అందజేస్తున్నారు. అయితే తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌కు కేబినెట్‌లో చోటిస్తానని.. అలా కానిపక్షంలో సలహాదారుడిగానైనా నియమించుకుంటానని ట్రంప్‌ గతంలోనే ప్రకటించారు. దీనిపై స్పందించిన మస్క్.. తాను ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియన్సీ’కి నేతృత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.


Similar News