Indians in Gulf | గల్ఫ దేశంలో రాత్రికి రాత్రే కోటీశ్వరులైన ఇద్దరు భారతీయులు.. అదెలాగంటే..

గల్ఫ దేశంలో పని చేస్తున్న ఇద్దరు భారతీయులకు (Indians) కలలో కూడా ఊహించనంత డబ్బు వచ్చి పడింది. లక్కీ లాటరీ తగలడంతో ఇలా వారి ఖాతాల్లోకి రాత్రికి రాత్రే కోట్లు వచ్చి పడ్డాయి. ఒకరు అబుదాబి బిగ్‌ టికెట్‌లో (Abu Dhabi Big Ticket), మరోకరు మహాజూజ్ డ్రాలో

Update: 2023-05-07 00:30 GMT

దిశ, వెబ్ డెస్క్ : గల్ఫ దేశంలో పని చేస్తున్న ఇద్దరు భారతీయులకు (Indians) కలలో కూడా ఊహించనంత డబ్బు వచ్చి పడింది. లక్కీ లాటరీ తగలడంతో ఇలా వారి ఖాతాల్లోకి రాత్రికి రాత్రే కోట్లు వచ్చి పడ్డాయి. ఒకరు అబుదాబి బిగ్‌ టికెట్‌లో (Abu Dhabi Big Ticket), మరోకరు మహాజూజ్ డ్రాలో (Mahazooz Draw) ఇలా భారీ మొత్తం గెలుచుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. అబుదాబిలో ఉండే ప్రదీప్ కుమార్ ఏప్రిల్ 13న కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నం.048514కు తాజాగా జాక్‌పాట్ తగిలింది. దాంతో 15 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నాడు. మన కరెన్సీలో అక్షరాల రూ.33.51కోట్లు అన్నమాట. అయితే, నిర్వాహకులు డ్రా అనంతరం విజేతగా నిలిచిన ప్రదీప్‌కు కాంటాక్ట్ చేయగా ఆయన స్వదేశంలో ఉన్నట్లు తెలిసింది.

మొదట అబుదాబి బిగ్‌ టికెట్‌ లాటరీ కార్యక్రమంలో హోస్ట్‌గా ఉన్న రిచర్డ్.. ప్రదీప్ ఇచ్చిన లోకల్ నంబర్‌కు కాల్ చేయగా అది పనిచేయలేదట. దాంతో అల్టర్‌నేటివ్ నంబర్‌గా ఇచ్చిన ఇండియన్ మొబైల్ నంబర్‌కు కాల్ చేశారట. దాంతో ప్రదీప్ తాను ప్రస్తుతం చెన్నై విమానాశ్రయంలో ఉన్నానని, అబుదాబికి తిరిగి వస్తున్నట్లు చెప్పాడు. దాంతో హోస్ట్ రిచర్డ్ అతడికి విజేతగా నిలిచిన విషయాన్ని తెలియజేయడంతో పాటు యూఏఈకి రాగానే ప్రైజ్‌మనీ కలెక్ట్ చేసుకోవాల్సిందిగా చెప్పారు. ఇక ఇంత భారీ మొత్తం గెలుచుకోవడంతో ప్రదీప్ ఆనందానికి అవధుల్లేవు. కాగా, తాను గెలిచిన ఈ భారీ ప్రైజ్‌మనీని మరో ఇద్దరు స్నేహితులతో పంచుకోనున్నట్లు ప్రదీప్ తెలిపాడు.

అలాగే ఖతార్‌లో (Qatar) ఉండే సుమైర్ (36) అనే భారత వ్యక్తికి కూడా పంటపడింది. మహాజూజ్ డ్రాలో 10లక్షల దిర్హమ్స్ గెలుచుకున్నాడు. భారత కరెన్సీలో రూ.2.22కోట్లు. ఖతార్‌లోని ఆఫ్‌షోర్ ఆయిల్ రిగ్‌లో ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న సుమైర్ మరో పది రోజుల్లో తాను గెలుచుకున్న నగదు తాలూకు చెక్కు అందుకోవడానికి యూఏఈ వెళ్లనున్నాడు. ఇక ఇంత భారీ మొత్తం గెలుస్తానని కలలో కూడా అనుకోలేదని చెప్పిన అతడు.. ఈ నగదులో కొంత భాగాన్ని చారిటీకి వినియోగిస్తానని చెప్పుకొచ్చాడు.


ఇవి కూడా చదవండి:

విమాన ప్రయాణంలో మహిళలకు చేదు అనుభవం.. అందరి ముందు ప్యాంటు విప్పమన్న సిబ్బంది  

Tags:    

Similar News