Donald Trump : బుల్లెట్ ప్రపంచంలోనే అతిపెద్ద దోమలా అనిపించిందన్న ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే.

Update: 2024-07-17 13:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే.అయితే ఈ ఘటన తర్వాత ట్రంప్- రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ మధ్య జరిగిన ప్రైవేట్ ఫోన్ కాల్ వీడియో రికార్డింగ్ ఈ వారం ప్రారంభంలో సోషల్ మీడియాలో లీక్ అయింది. దీనిలో ట్రంప్ మాట్లాడుతూ, హత్యాయత్నంపై ప్రస్తావిస్తూ, తన చెవిని తాకిన బుల్లెట్ ప్రపంచంలోనే అతిపెద్ద దోమ లాగా అనిపించిందని అన్నారు. “నేను చార్ట్‌ని చూపించడానికి తల తిప్పాను, నా వైపుగా ఎదో దూసుకువచ్చినట్లు అనిపించింది. అది నాకు ప్రపంచంలోనే అతిపెద్ద దోమలా అనిపించింది” అని ట్రంప్ చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన రికార్డింగ్ సోషల్‌మీడియాలో వైరల్ అయింది. శనివారం పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై దుండగుడు కాల్పులు జరపడంతో క్షణాల్లో బుల్లెట్ ఆయన చెవి నుంచి దూసుకుపోయింది.

మరోవైపు న్యూయార్క్ పోస్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు కృతజ్ఞతలు తెలిపారు. చార్ట్ చదవడానికి తన తలను కొద్దిగా కుడివైపుకి తిప్పకపోతే, తాను ఇప్పటికి ప్రాణాలతో ఉండే వాడిని కాదని అన్నారు. బుల్లెట్ చెవిని తాకిన వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వేగంగా అలర్ట్ అయి తన చుట్టూ చేరారని అలాగే, నిందితుడిని వేగంగా పట్టుకున్నారని అన్నారు. ఏజెంట్ల చర్యలు అద్భుతమైనదిగా ట్రంప్ అభివర్ణించాడు.

Tags:    

Similar News