Trump:నేను గెలిస్తే.. వాళ్ళందరిని జైలుకు పంపిస్తా.. ట్రంప్ తీవ్ర హెచ్చరిక

అమెరికా(America)లో ఈ ఏడాది నవంబర్ 5న ఎన్నికలు జరగనున్న సంగంతి తెలిసిందే.

Update: 2024-09-08 22:27 GMT

దిశ, వెబ్‌డెస్క్:అమెరికా(America)లో ఈ ఏడాది నవంబర్ 5న ఎన్నికలు జరగనున్న సంగంతి తెలిసిందే.ఈ ఎన్నికల్లో డెమోక్రాటిక్(Democratic) పార్టీ నుంచి కమలా హారీస్(Kamala Harris) బరిలోకి నిలుస్తుండగా ఆమెకు పోటీగా రిపబ్లికన్(Republican) పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బరిలో ఉన్నారు.అధ్యక్ష ఎన్నికల సమీపిస్తున్న వేళ ఇరువురి ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. మరోవైపు వీరిద్దరూ సెప్టెంబర్‌ 10న తొలి సారిగా డిబేట్ లో పాల్గొననున్నారు.ఈ డిబేట్ పై యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈనేపథ్యంలో ట్రంప్‌ ఎన్నికలో సమయంలో అవినీతికి పాల్పడే వారిని ఉద్దేశిస్తూ 'ఎక్స్‌'( X) వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధికారం లోకి వచ్చాక ఎన్నికల సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారందరిని జైలుకు పంపిస్తానని తీవ్రంగా హెచ్చరించారు.

దయచేసి జాగ్రత్త వహించండి.. 'ఈ ఎన్నికల్లో నేను గెలిస్తే అధ్యక్ష ఎన్నికల సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినవాళ్లను వదిలే ప్రసక్తే లేదని , వారు చట్టపరంగా పూర్తిస్థాయిలో విచారణ ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. అంతే కాకుండా దోషులుగా తెలితే కచ్చితంగా కఠినమైన శిక్షలను అమలు చేస్తాం.ఈ చట్టపరమైన చర్యలు అందరికీ వర్తిస్తాయి. న్యాయవాదులు, రాజకీయ నాయకులు, దాతలు, అక్రమ ఓటర్లు, ఎన్నికల అధికారులకు వర్తిస్తుంది. అక్రమాలకు పాల్పడినవాళ్లను వెతికిమరీ విచారించి, శిక్షలు విధిస్తాం'' అని ట్రంప్‌ అన్నారు.గత అధ్యక్ష ఎన్నికల్లో అవినీతీ జరిగిందంటూ ట్రంప్ చాలా సార్లు ఆరోపించారు. దీంతో ఓటింగ్ సమయంలో మరోసారి అవినీతి జరగకుండా ఉండాలనే అయన ఈ వాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఎన్నికల వేళ ట్రంప్‌ చేసిన వాఖ్యలు అమెరికా దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.


Similar News