అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ట్రంప్ భార్య మెలానియా రాకపోవడానికి కారణం ఇదే

ప్రస్తుతం అమెరికాలో ఎన్నికల హడావుడి నెలకొంది. అధ్యక్షుడు బైడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ తమ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు

Update: 2024-04-07 11:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం అమెరికాలో ఎన్నికల హడావుడి నెలకొంది. అధ్యక్షుడు బైడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ తమ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. అయితే ట్రంప్ భార్య మెలానియా ఎన్నికల ప్రచారానికి రాకపోవడంపై సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చిస్తున్నారు. కొంతమంది అయితే మెలానియా మిస్ అయిందని పోస్ట్‌లు కూడా పెడుతున్నారు. ఇటీవల కాలంలో ట్రంప్ అనేక కోర్టు విచారణలను ఎదుర్కోగా ఆ కార్యక్రమాలకు కూడా మెలానియా దూరంగానే ఉన్నారు. ఇటీవల ఈస్టర్ ఆదివారం రోజున తన కుమారుడు బారన్ ట్రంప్‌తో కలిసి మార్-ఎ-లాగోలో కనిపించింది.

ఈ నేపథ్యంలో ఈవెంట్‌లకు మెలానియా రాకపోవడానికి గల కారణాలను ట్రంప్ తాజాగా పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో మెలానియాను బయటకు రానీయకుండా చేయడం తన నిర్ణయమని ట్రంప్ స్పష్టతనిచ్చారు. ఆమెను ప్రచారానికి దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మార్చి చివరిలో మెలానియా సన్నిహితుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, 2024 అధ్యక్ష ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది ఆమె ఎక్కువగా కనిపిస్తారని తెలిపారు.

ట్రంప్, మెలానియా వెస్ట్ పామ్ బీచ్‌లో శనివారం నిధుల సేకరణను కూడా నిర్వహించనున్నారు. ఆమె ఏప్రిల్ 20న లాగ్ క్యాబిన్ రిపబ్లికన్‌ల కోసం మార్-ఎ-లాగో ఈవెంట్‌లో కూడా పాల్గొంటుందని సమాచారం. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెలానియా కనిపించకపోవడంతో, డొనాల్డ్ ట్రంప్ ఆమెను ఎందుకు దాచిపెడుతున్నారు? మేము ఆమెను కోల్పోతున్నాము. దయచేసి ఆమె కనబడితే చెప్పండి అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.


Similar News