Canada: వలసల నియంత్రణ కోసం కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం

వలసల నియంత్రణ కోసం కెనడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వలసల నియంత్రణ కోసం ట్రూడో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-10-24 04:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వలసల నియంత్రణ కోసం కెనడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వలసల నియంత్రణ కోసం ట్రూడో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోకి అనుమతించే వలసదారుల సంఖ్యను భారీగా తగ్గించేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే భారత్ తో దౌత్య వివాదం, సొంత పార్టీ నేతల నుంచే ప్రధాని ట్రూడోకు నిరసన సెగ.. ఇలాంటి టైంలో మరోసారి అధికారంలోకి రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక కథనాలు కూడా వెలువడ్డాయి. కాగా.. 2024లో 4,85,000 మందిని శాశ్వత నివాసితులుగా కెనడా గుర్తించింది. అయితే, 2025లో ఈ సంఖ్య 3,80,000లకు మాత్రమే పరిమితం చేసింది. 2027 నాటికి 3,65,000 మందికి మాత్రమే ప్రవేశం కల్పించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే ఎన్నికలు

ఇకపోతే, వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే, సర్వేల్లో ట్రూడో నేతృత్వంలోని లిబరల్‌ ప్రభుత్వం వెనకంజలో ఉంది. వలసల కారణంగా నిరుద్యోగం పెరిగిపోతుండటంతో పాటు, దేశీయంగా ఇళ్ల కొరత విపరీతంగా ఉంది. దీంతో ట్రూడో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులోభాగంగానే విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు, వర్కర్లకు పని అనుమతులపై కఠిన ఆంక్షలు తీసుకురానున్నట్లు ప్రకటించింది. అలానే వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


Similar News