ఎవరెస్ట్‌పై ట్రాఫిక్ జామ్.. పర్వతారోహకులతో బిజీగా మారిన మంచు కొండలు

హిమాలయాల్లో ఉన్న ఎవరెస్ట్‌ శికరంపై ట్రాఫిక్ జామ్ అయింది. అవును మీరు విన్నది నిజమే. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని దాదాపు ప్రతి అధిరోహకుడి కోరిక.

Update: 2024-05-30 09:43 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హిమాలయాల్లో ఉన్న ఎవరెస్ట్‌ శికరంపై ట్రాఫిక్ జామ్ అయింది. అవును మీరు విన్నది నిజమే. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని దాదాపు ప్రతి అధిరోహకుడి కోరిక. కానీ ఈ కోరిక అంత సింపుల్ కాదు.. చాలా మంది ప్రాణాలను పణంగా పెట్టి శిఖరంపైకి ఎక్కుతుంటారు. ఈ క్రమంలోనే కొందరు ప్రాణాలు సైతం కోల్పోతుంటారు. కొన్ని సందర్భాల్లో చనిపోయిన వారి మృతదేహాలను అక్కడే వదిలేసి మిగిత అధిరోహకులు కిందకి వస్తుంటారు. అయితే, తాజాగా ఈ ఏడాది, ఎవరెస్ట్‌పై అధిరోహణ సీజన్ ప్రారంభమైంది. వెంటనే వందలాది మంది ఎవరెస్ట్‌పై ఎక్కడం ప్రారంభించారు.

గుంపులు గుంపులుగా అధిరోహకులు

ఈ నేపథ్యంలోనే ఎవరెస్ట్‌‌పై గుంపులు గుంపులుగా ఉన్న అధిరోహకుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వందలాది మంది తాడు సహాయంతో ఎవరెస్ట్‌ను అధిరోహిస్తున్నారు. ఈ ప్రయత్నంలో ప్రజలు ఉక్కిరిబిక్కిరి చేస్తూ నెమ్మదిగా పైకి జారడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కన్పిస్తోంది. దీంతో ఎవరెస్ట్‌పై ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తోంది. రాజన్ ద్వివేదీ అనే పర్వతారోహకుడు తన ఇన్‌స్టా గ్రామ్‌లో వీడియోను పోస్ట్ చేశారు. ఈ నెల 19న ఉదయం 6 గంటలకు విజయవంతంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఈ నెల 20న తిరిగి కిందకి దిగే క్రమంలో సుమారు 500 మంది పర్వతారోహకులు తనకు ఎదురుగా వచ్చారని వెల్లడించారు.

ఎవరెస్ట్ ఎక్కడం జోక్ కాదు..

ఎవరెస్ట్ ఎక్కడం అంటే జోక్ కాదని, ఇది ఎంతో కష్టతరమైన విషయమని పేర్కొన్నాడు. తనకు దారిలో కనిపించిన వారిలో 250 నుంచి 300 మంది మాత్రమే ఎవరెస్ట్‌ను అధిరోహించగలరని రాజన్ ద్వివేదీ అభిప్రాయం వ్యక్తంచేశారు. 1953లో మొదలైన ఎవరెస్ట్ పర్వతారోహణ నుంచి ఇప్పటి వరకు దాదాపు 7 వేల మంది మాత్రమే శిఖరంపైకి చేరుకున్నారని పేర్కొన్నారు. కాగా, గత వారం ఐదుగురు అధిరోహకులు మరణించినట్లు వార్తలు వచ్చాయి.

Full View

Tags:    

Similar News