GPS లొకేషన్ గుడ్డిగా ఫాలో అయ్యారు.. చివరికి వాళ్లకు ఏ గతి పట్టిందంటే..

టెక్నాలజీ అభివ‌ృద్ధి చెందాక.. ఏదైనా తెలియని ప్రదేశానికి వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా అందరూ వాహనంలో GPSని అనుసరించి వెళ్తారు. అయితే ఒక్కోసారి GPS రాంగ్ డైరెక్షన్

Update: 2023-05-08 19:59 GMT

దిశ, వెబ్ డెస్క్ : టెక్నాలజీ అభివ‌ృద్ధి చెందాక.. ఏదైనా తెలియని ప్రదేశానికి వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా అందరూ వాహనంలో GPSని అనుసరించి వెళ్తారు. అయితే ఒక్కోసారి GPS రాంగ్ డైరెక్షన్ కూడా చూపిస్తుంది. దానివల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు.

అలా ఇద్దరు టూరిస్టులు GPS డైరెక్షన్‌ని నమ్ముకొని వెళుతూ తమ కారుని సముద్రంలోకి తీసుకెళ్లారు. సమయానికి స్ధానికులు వారిని కాపాడటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటనని ఒక వ్యక్తి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియా పెట్టాడు. నెటిజెన్లు మాత్రం ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు.

ఎలా జరిగిందంటే.. ఇద్దరు టూరిస్టులు కారులో ప్రయాణిస్తున్నారు.. గుడ్డిగా GPSని అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా సముద్రంలోకి వెళ్లిపోయింది. ఇంకేముంది కారు మునిగిపోవడం మొదలైంది. కాపాడమంటూ వారు చేసిన అరిచేసరికి స్ధానికులు వెంటనే స్పందించారు. వారిని కాపాడేందుకు నీటిలో దూకారు. కారు విండోలు కొన్నిక్షణాల్లో మునిగిపోతాయనగా కారు నుంచి వారిని సురక్షితంగా బయటకు లాగారు. కానీ వాని కారు మాత్రం నిండా మునిగిపోయింది.


గడువు ముగిసిన మ్యాప్‌లను డిజిటల్ ప్రొవైడర్లు అప్ డేట్ చేయకపోవడం వల్ల GPS సరిగా పనిచేయకపోవచ్చునట. ఇక సిగ్నల్ సమస్యలు ఉన్నా కూడా ఇలాంటి అవాంతరాలు ఏర్పడతాయట. అయితే టూరిస్టులు మరీ అంత గుడ్డీగా సముద్రంలోకి కారును మళ్లించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక నెటిజెన్ కామెంట్ చేస్తూ.. వాళ్లు తమ గమ్యం సముద్రం లోపల ఉందనుకున్నారు.. కాబోలు! అని ఫన్నీగా రాశాడు.


ఇవి కూడా చదవండి:

22 year old millionaire | 22 ఏళ్లకే కోటీశ్వరుడైన కుర్రాడు.. చదివింది హైస్కూల్ మాత్రమే!  

Tags:    

Similar News