TikTok banned on devices issued by US House of Representatives
ప్రముఖ చైనీస్ వీడియో యాప్ టిక్‌టాక్‌పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ చైనీస్ వీడియో యాప్ టిక్‌టాక్‌పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రానిక్ డివైస్‌లలో టిక్ టాక్ యాప్ వినియోగంపై నిషేధం ప్రకటించింది. అయితే దేశం మొత్తం నుంచి తొలగించడం కాకుండా ప్రభుత్వ ఎలక్ట్రానిక్ డివైస్‌లలో నిషేదం విధించింది. ఈ నిషేధం త్వరలోనే అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే టిక్ టాక్ యాప్ ద్వారా భద్రతా సమస్యలు ప్రమాదంగా పరిగణించబడ్డాయని, తమ దేశంపై నిఘా వేయడానికి చైనాకు అవకాశాలున్నాయని భావించినట్లు తెలిపింది. ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హౌస్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిబ్బందికి సమాచారం అందించారు. యాప్ నిషేధానికి సంబంధించి ప్రభుత్వ వర్గాలకు నియమావళి విడుదల చేశారు.