BIG News : టిక్ టాక్‌పై నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం .. సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. ఎక్కడంటే..?

నేపాల్ దేశం యొక్క సామాజిక సామరస్యానికి భంగం కలిగించినందుకు ప్రసిద్ధ వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌ టిక్ టాక్ (Tik Tok) ను తొమ్మిది నెలల కిందట నేపాల్ ప్రభుత్వం నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

Update: 2024-08-22 23:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేపాల్ దేశం యొక్క సామాజిక సామరస్యానికి భంగం కలిగించినందుకు ప్రసిద్ధ వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌ టిక్ టాక్ (TikTok) ను తొమ్మిది నెలల కిందట నేపాల్ ప్రభుత్వం నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా టిక్‌ టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేసినట్లు నేపాల్ కమ్యూనికేషన్ మంత్రి గురువారం తెలిపారు.గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో టిక్‌ టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ విలేకరులతో తెలిపారు. నేపాల్ నిబంధనలను పాటిస్తామని, నిషేధాన్ని ఎత్తివేయాలని అభ్యర్థిస్తూ టిక్‌టాక్ దక్షిణాసియా విభాగం ప్రభుత్వాన్ని సంప్రదించిన వారం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పృథ్వీ సుబ్బా వెల్లడించారు. కాగా గత నవంబర్ లో టిక్ టాక్‌పై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి ప్రజలు ఖండించారు.నేపాల్ దేశంలో దాదాపుగా 22 లక్షల మంది టిక్ టాక్ వాడుతున్నారు.

అయితే నేపాల్ తాజాగా నిషేధం ఎత్తి వేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అంజనా ఆర్యల్ అనే గృహిణి స్వాగతించారు. గతంలో తాను టిక్ టాక్ లో వంటకాల వీడియోలు చేస్తూ పైసలు సంపాదించే దాన్ని అని తెలిపారు. అయితే ఈ యాప్ నుండి ప్రయోజనం పొందిన నాలాంటి చాలా మంది క్రియేటర్‌లకు ఈ నిషేధం ఎత్తివేసిన వార్త నిజంగా సంతోషం కలిగిస్తుందని తెలిపింది. అలాగే టిక్ టాక్ బ్యాన్ తరువాత చాలా మంది ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకు మారారు, కానీ వారికి అదే రకమైన రీచ్ లేదు. టిక్‌టాక్ బ్యాక్‌తో, నేను మళ్లీ చాలా బిజీగా ఉంటానని అంజనా ఆర్యల్ ఓ మీడియాతో తెలిపింది. టిక్ టాక్‌పై బ్యాన్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేసిన న్యాయవాది దినేష్ త్రిపాఠి మాట్లాడుతూ.. ఈ నిర్ణయం "స్వేచ్ఛకు విజయమని, ప్రజాస్వామ్యంలో వాక్‌స్వేచ్ఛ అంతర్భాగమని, నిషేధం ఎత్తి వేస్తూ తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయమని తెలిపారు.


Similar News