ఇది కదా విశ్వాసం అంటే.. యజమాని ప్రాణాలు కాపాడిన కుక్క
కుక్కల విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, వెబ్‌డెస్క్: కుక్కల విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనం పెట్టే కొంచెం ఆహారానికే ప్రాణాలు పణంగా పెట్టి మరీ రాత్రింబవళ్లు రక్షిస్తుంటాయి. ఇలా యజమానుల పట్ల కుక్కుల విశ్వాసం చూపుతున్న వీడియోలు అనేకం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా.. ఓ కుక్క నిండు ప్రాణాలను కాపాడింది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తన యజమానికి సరిపోయే మ్యాచ్‌ను గుర్తించి.. ఆమెను ప్రాణాపాయం నుంచి రక్షించింది.
ఇలా మ్యాచ్ అవ్వడం కూడా 22 మిలియన్లలో ఒకరికి జరుగుతుందట. అది ఆమె విషయంలో జరిగింది. లూసీ అనే ఓ మహిళ తన కుక్కలు జేక్, ఇండీని సౌత్ వేల్స్‌లోని ఒక బీచ్‌కి తీసుకువెళ్లింది. ఇండీ ఉత్సాహంగా 100 గజాల దూరంలో ఉన్న అపరిచితురాలి వద్దకు పరుగెత్తింది. దీంతో కుక్క యజమాని లూసీ సైతం ఆ అపరిచితురాలి వద్దకు వెళ్లింది. అనంతరం ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది.
ఈ సంభాషణ సమయంలో ఆమె కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు, దాతల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే కేటీ తన కిడ్నీని దానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడంతో, ఇద్దరు మహిళలు గతేడాది అక్టోబర్ 3న కార్డిఫ్‌లోని యూనివర్శిటీ హాస్పిటల్ ఆఫ్ వేల్స్‌కు వెళ్లారు. ఆపరేషన్ విజయవంతమైంది. దీంతో బీచ్‌లో అపరిచితురాలి వద్దకు వెళ్లిన కుక్కను అందరూ ప్రశంసిస్తున్నారు. కుక్క ఆమె వద్దకు వెళ్లకుంటే కిడ్నీ దొరికి ఉండేది కాదని డాక్టర్లు అభినందించారు.