నడిరోడ్డపై పడగవిప్పి.. ఏకంగా ట్రాఫిక్ సిగ్నల్స్‌నే ఆపేసిన పాము!
సహజంగా పాములను చూస్తే ఎవరైనా భయపడి పరుగులు తీస్తుంటారు.
దిశ, వెబ్‌డెస్క్: సహజంగా పాములను చూస్తే ఎవరైనా భయపడి పరుగులు తీస్తుంటారు. రోడ్డుకు అడ్డంగా వెళ్తుందంటే కాసేపు ఆగి మళ్లీ ప్రయాణం ప్రారంభిస్తారు. కానీ, ఓ పాము ఏకంగా ట్రాఫిక్ సిగ్నల్‌నే ఆపేసింది. ఈ ఘటన అమెరికాలోని వర్జీనియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రిన్స్ విలియం కౌంటీలోని ప్రిన్స్ విలియం పార్క్ వే కూడలిలో ఉన్న ఓ కరెంటు ప్యానెల్‌లోకి పెద్ద పాము ఒకటి దూరడంతో అందులోని బ్రేకర్ స్విచ్ ఆఫ్ అయ్యింది. దీంతో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం ఆగిపోయాయి. విషయాన్ని గమనించిన అధికారులు వెంటనే పామును బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో పడగవిప్పి అక్కడున్న వారిని భయపెట్టింది. ఆఫీసర్లు చాలా కష్టపడి పామును బయటకు తీసి అటవీప్రాంతంలో వదిలేశారు. తర్వాత విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.