మోడీకి ఫోన్ చేసిన అమెరికా అధ్యక్షుడు.. హస్తినకు రానున్న అమెరికా ప్రతినిధి..

భారతదేశంలో ఎన్నికలు ముగిశాయి.

Update: 2024-06-06 10:48 GMT

దిశ వెబ్ డెస్క్: భారతదేశంలో ఎన్నికలు ముగిశాయి. త్వరలో మరోసారి మోడీ నాయకత్వంలో కొత్తప్రభుత్వం రూపుదిద్దుకోనుంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు అగ్రరాజ్యం ఆశపడుతోంది. ఇప్పటికే తమ దేశ జాతీయ భద్రతా సలహాదారు జాక్‌ సలీవాన్‌ను భారతదేశానికి పంపించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు శ్వేతసౌధం ప్రకటించింది.

కాగా నేడు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మోడీకి ఫోన్ చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్‌ సలీవాన్‌ న్యూడిల్లీ పర్యటన ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే అమెరికా ప్రతినిధి భారత్ పర్యటన తేదీలు ఇంకా ప్రకటించ లేదు. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అమెరికా ప్రతినిధి భారత్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా ఇరుదేశాల ప్రధాన్యాలపై ఈ చర్చలు జరగనున్నాయని, ముఖ్యంగా వ్యూహాత్మక బంధం, సాంకేతిక భాగస్వామ్యం, పరస్పర విశ్వాసం వంటి పలు అంశాలపై చర్చించనున్నారని సమాచారం.


Similar News