దిశ, డైనమిక్ బ్యూరో: ఉక్రెయిన్- రష్యా యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో కీవ్ నగరంలో ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కేంద్రం హెచ్చరించింది. రష్యా సైనికులు కీవ్ నగరంలో విధ్వంసం చేయబోతున్నారన్న సంకేతాల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో వెంటనే కీవ్‌ను వదిలి వెళ్లిపోవాలని అక్కడి భారతీయులకు పిలుపునిచ్చింది. అక్కడున్న వారిని తరలించేందుకు భారత రాయబార కేంద్రం తీవ్రంగా శ్రమిస్తోంది. ముఖ్యంగా రైలు మార్గాన్ని వినియోగించి వెంటనే ఉక్రెయిన్ బార్డర్లకు, ఇతర సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. అంతేగాకుండా సీ-17 విమానాల ద్వారా భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది.