Tesla : ఎలాన్ మస్క్ కు బిగ్ షాక్.. టెస్లా వైస్ ప్రెసిడెంట్ రాజీనామా

గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

Update: 2024-08-24 22:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. టెస్లా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న భారత సంతతికి చెందిన శ్రీలా వెంకటరత్నం తన పదవికి రాజీనామా చేశారు.దాదాపు 11 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత టెస్లాకు వీడ్కోలు పలుకుతున్నానని తెలిపారు. అయితే కుటుంబంతో, స్నేహితులతో సమయాన్ని గడపడానికి, వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టడానికే కంపెనీని విడిచిపెడుతున్నట్లు తెలిపారు.ఈ విషయాన్నీ తన లింక్డ్‌ఇన్‌ లో పోస్ట్ చేశారు.ఈ ఏడాది ఏప్రిల్ లో ముగ్గురు ఎగ్జిక్యూటివ్ లు టెస్లాకు గుడ్ బై చెప్పారు. తాజాగా కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీలా వెంకటరత్నం రాజీనామా చేశారు.

కాగా శ్రీలా వెంకటరత్నం 2013 నుండి టెస్లా లో పని చేస్తోంది. ఆమె గత 11 ఏళ్లలో ఫైనాన్స్ ఆపరేషన్ డైరెక్టర్‌గా అలాగే సీనియర్ డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ గా పలు హోదాల్లో పని చేశారు. ఆమె జూన్ 2019 నుండి జూన్ 2024 వరకు 5 సంవత్సరాల పాటు టెస్లా ఉపాధ్యక్ష పదవిని నిర్వహించారు. కొంత కాలం విరామం తీసుకున్న తర్వాత కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తానని శ్రీలా వెంకటరామన్ తెలిపారు.వెంకటరామన్ 2013లో టెస్లాలో డైరెక్టర్ ఆఫ్ అకౌంటింగ్‌గా చేరినప్పుడు కంపెనీ యొక్క వార్షిక ఆదాయం1 బిలియన్ డాలర్లు ఉండగా ప్రస్తుతం 100 బిలియన్లకు చేరుకుంది. టెస్లాలో వైస్ ప్రెసిడెంట్ (VP) టైటిల్‌ను కలిగి ఉన్న ఇద్దరు మహిళల్లో శ్రీలా వెంకటరత్నం  ఒకరు.


Similar News