చెక్‌పోస్టుపై ఉగ్రవాదుల దాడి.. నలుగురు భద్రతా సిబ్బంది మృతి

చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు(Terrorist attack) దాడి చేయడంతో నలుగురు పాక్ భద్రతా సిబ్బంది(security personnel) మృతి చెందారు.

Update: 2024-10-25 04:03 GMT

దిశ, వెబ్ డెస్క్: చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు(Terrorist attack) దాడి చేయడంతో నలుగురు పాక్ భద్రతా సిబ్బంది(security personnel) మృతి చెందారు. ఈ ఘటన పాకిస్థాన్‌(Pakistan)లోని ఖైబర్ పఖ్తుంక్వా చెక్‌పోస్టు వద్ద చోటు చేసుకుంది. ప్రావిన్స్‌లో తమ చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు గురువారం దాడి చేయడంతో కనీసం నలుగురు భద్రతా సిబ్బంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించిన అధికారులు వారికి చికిత్సను అందిస్తున్నారు. దాడి జరిగిన వెంటనే ఇతర దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, దుండగులను అరెస్టు చేసేందుకు దళాలు భారీ శోధన ఆపరేషన్‌ను ప్రారంభించాయని అధికారి తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయాడు. కాగా పాకిస్తాన్ లో నిత్యం ఇలాంటి దాడులు సర్వసాధారణం అయ్యాయి.


Similar News