టెర్రరిజరం టూ గవర్నెన్స్.. తాలిబన్ల క్వైట్ క్విట్టింగ్
తాలిబన్లకు కొత్త సమస్య వచ్చి పడింది.
దిశ, వెబ్‌డెస్క్: తాలిబన్లకు కొత్త సమస్య వచ్చి పడింది. ఉగ్రవాదం నుంచి ఒక్క సారిగా ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యతలు, ఒత్తిడిని వారు తట్టుకోలేక పోతున్నారు. దీంతో కొంత మంది వారికి అప్పగించిన బాధ్యతలను నుంచి క్వైట్ క్విట్టింగ్ చేస్తున్నట్లు తెలిసింది. అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సేనల నిష్క్రమణ తర్వాత తాలిబన్లు పాలన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు తుపాకీ చేతబట్టి యుద్ధం చేసినా వారిలో కొందరికి ప్రభుత్వ నిర్వహణ భారంగా మారుతోంది.
ఈ నేపథ్యంలో కొందరు తాలిబన్లు నగర జీవితానికి అలవాటు పడలేకపోతున్నారని అఫ్గాన్ కేంద్రంగా పనిచేసే అఫ్గానిస్థాన్ అనలిస్ట్ నెట్ వర్క్ అనే ఎన్జీవో సంస్థ తాజాగా తెలిపింది. అప్పటి వరకు వార్ లో భాగంగా కొండ ప్రాంతాల్లో, గ్రామాల్లో నివసించిన తాలిబన్లు ప్రభుత్వ విధుల్లో భాగంగా కాబూల్ కు వచ్చారు. అయితే, ఇక్కడి లైఫ్ స్టైల్ వారికి కష్టంగా మారింది. దీంతో వారికి అప్పగించిన బాధ్యతల నుంచి క్వైట్ క్విట్టింగ్ చేస్తున్నారని సదరు ఎన్జీవో తెలిపింది. తాలిబన్లు తమకు అప్పగించిన బాధ్యతలను సరిగా నిర్వహించకపోవడంతో అది ప్రభుత్వ నిర్వహణపై ఎఫెక్ట్ చూపుతోంది.
ఎక్కువ సమయం ఆఫీసుల్లో గడపడం, రిపోర్ట్స్ తయారు చేయడం, ఫైనాన్షియల్ అంశాల నిర్వహణ వంటివి వారికి కొత్తగా ఉండటంతో వారిలో కూడా కొంతమంది క్వైట్ క్విట్టింగ్ చేస్తున్నారని ఎన్జీవో తెలిపింది. ట్రాఫిక్ నియంత్రణ సరిగా లేకపోవడంతో సాధారణ పౌరులు, ఆఫీసుల్లో పని చేసే వారికి ఇబ్బందులు తప్పడం లేదని ఎన్జీవో తెలిపింది. యుద్ధం చేసిన వారికి ప్రభుత్వ నిర్వహణ సవాలుగా మారిందని పలువురు వాపోతున్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగితే వారు నేరుగా తాలిబన్లనే ప్రశ్నిస్తున్నారు. తాలిబన్లు ఏదైనా తప్పు చేస్తే అంతర్జాతీయ మీడియా సంస్థలు సైతం వారికి పరిపాలన చేతకావడం లేదని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాలిబన్ ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రపంచంలోని మీడియా సంస్థల కెమెరాలు తమపైనే ఉన్నాయన్నారు. తాజా పరిణామాలు తాలిబన్ల పాలనపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
Also Read..