11వ బిడ్డకు తండ్రైన టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్?

ప్రముఖ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరో సారి తండ్రి అయినట్లు వార్తలు వస్తున్నాయి.

Update: 2024-06-23 08:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరో సారి తండ్రి అయినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో మస్క్ తో కవలలకు జన్మినిచ్చిన నూరాలింక్ స్పెషల్ ప్రాజెక్ట్ హెడ్ షివాన్ జెలీస్ కు మూడో సంతానం కలిగింది. దీంతో మస్క్ 11 మంది పిల్లలకు తండ్రి అయ్యారు. దీనికి సంబందించిన వివరాలు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ సంతానం గురించిన వివరాలు ప్రముఖ పత్రిక బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. దీనిపై మస్క్ ఎలాంటి ప్రకటన చేయలేదు. సాధారణంగా మస్క్ తన పిల్లల గురించిన వివరాలు బయటకు వెల్లడించడానికి ఇష్టపడడు ఇప్పటివరక పుట్టిన వాళ్లలో కవలల గురించి మాత్రమే ఆయన స్వయంగా చెప్పారు.

మస్క్ కు ఉన్న 11 మంది సంతానంలో మొదటి భార్య జస్టిన్ మస్క్ కు ఐదుగురు, మ్యూజిషియన్ గ్రిమెస్ కు మరో ముగ్గురు, ఇప్పడు సంతానం కలిగిన జెలీస్ కు కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు. మస్క్ తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగినులతో సన్నిహిత సంబందాలు పెట్టుకోవడం పై గతంలో పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 2013 లో స్పెస్ ఎక్స్ నుంచి ఉద్యోగం మానేసిన ఓ మహిళ మస్క్ తనతో పిల్లలు కనాలని కోరినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని అప్పట్లో వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. అంతేగాక మరి కొందరు ఉద్యోగినిలతో సన్నిహిత సంబందాలు ఉన్నట్లు ఆరోపనలు కూడా వచ్చాయి. న్యూరాలింక్ ఉద్యోగి జెలీస్ కు కవలలు జన్మించిన సమయంలో మస్క్ మాట్లాడుతూ..ఎక్కువ మంది సంతానం లేకపోతే నాగరికత కుంగిపోతుందని, తన మాటలు రాసిపెట్టుకోవాలని అన్నారు. అలాగే తనతో పిల్లలు కనాలని మస్క్ ప్రోత్సహించాడని జెలీస్ వెల్లడించారు.

Similar News