సార్ కాదు మేడమ్..!.. "థాంక్యూ సర్" అన్నందుకు విమానం నుంచి దించేశారు

విమానాశ్రయంలో పనిచేసే మహిళా సిబ్బందిని పురుషునిగా భావించి థాంక్యూ.. సర్ అన్నందుకు ఓ మహిళను విమానం నుంచి దించేశారు.

Update: 2024-06-28 09:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: విమానాశ్రయంలో పనిచేసే మహిళా సిబ్బందిని పురుషునిగా భావించి థాంక్యూ.. సర్ అన్నందుకు ఓ మహిళను విమానం నుంచి దించేశారు. ఈ వింత ఘటన శాన్ ఫ్రాన్సిస్కో లోని ఓ ఎయిర్ పోర్ట్ లో చోటు చేసుకుంది. ఘటన ప్రకారం టెక్సాస్ కు చెందిన జెన్నా లాంగోరియా అనే మహిళ తన కొడుకు, తల్లితో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఆస్టిన్ వెళ్లెందుకు బయలుదేరింది. యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో ఎక్కే సమయంలో సిబ్బంది బోర్డింగ్ పాస్ ను అందించారు. ఆ మహిళా సిబ్బంది వేషాధారణ చూసి పొరపాటున పురుషుడిగా భావించి థాంక్యూ.. సర్ అని చెప్పింది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ మహిళ ప్రయాణికురాలితో పాటు తల్లిని, బిడ్డను విమానం ఎక్కకుండా ఆపేసింది. దీనిపై అక్కడే ఉన్న మరో పురుష సిబ్బందిని సహాయం కోరుతూ.. తన తల్లి, కుమారుడిని విమానం ఎక్కకుండా ఆయన అడ్డుకుంటున్నాడని తెలిపింది. దీంతో ఆ పురుష సిబ్బంది ఆయన కాదు ఆమె అని బదులిచ్చాడు. ఆశ్చర్యానికి గురైన జెన్నా తన తప్పును తెలుసుకుంది. దీనిపై ఆ మహిళా సిబ్బందికి క్షమాపణలు తెలిపిన వినిపించుకోకుండా విమానం నుంచి దింపేశారు. తనకు జరిగిన వింత అనుభవాన్ని జెన్నా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. దీంతో దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Similar News