ఇంట్లోకి దూరిన నాగుపాము.. ఏం చేస్తుందో చూస్తే షాక్ అవ్వాల్సిందే? (వీడియో)

బుల్లితెర సీరియల్స్‌కు ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-07-01 15:23 GMT

దిశ, ఫీచర్స్: బుల్లితెర సీరియల్స్‌కు ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహిళలు రోజంతా టీవీ ముందు కూర్చుని సీరియల్స్ చూడమన్నా చూస్తారు. కొన్నిసార్లు సీరియల్స్ నటీనటులు ఏడుస్తుంటే.. వాళ్లు కూడా కన్నీరు పెట్టుకుంటారు. మహిళలు సీరియల్స్‌లో అంత లీనమైపోయి చూస్తారన్నమాట. వంట చేయకున్నా కానీ డైలీ తమకు నచ్చిన సీరియల్స్ మాత్రం ఒక్క సీన్ మిస్ కాకుండా చూస్తారు. అన్ని చానల్స్‌లో ప్రసారమయ్యే షోస్ కంటే సీరియల్స్‌కే ఎక్కువ రేటింగ్ రావడం వల్ల దూసుకుపోతున్నాయి.

తాజాగా, సీరియల్స్ విషయంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. మహిళలే కాదు.. ఓ ఇంట్లో దూరిన నాగుపాము కూడా ఏకంగా రెండు గంటలపాటు సీరియల్ చూస్తూ ఉండిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది. ఇందులో ఓ నాగుపాము టీవీ ముందు కూర్చుని జీ కన్నడ చానెల్‌లో వచ్చే సీరియల్ చూస్తూ ఉండిపోయింది. ఇక ఈ వీడియోను చూసిన వారంతా అది కూడా ఆడ పాము అయి ఉంటుందని ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Similar News