మొదటి ఏఐ డ్రెస్‌ను రెడీ చేసిన మహిళ.. కదులుతున్న పాములను పెట్టడంతో నెట్టింట ప్రశంసలు (వీడియో)

ఇటీవల కాలంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-07-03 12:37 GMT

దిశ, ఫీచర్స్: ఇటీవల కాలంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన కానుండి చాలా మంది తమ టాలెంట్స్‌ను బయటపెడుతూ పాపులారిటీ పెంచుకుంటున్నారు. కొందరు టెక్నాలజీతో వెరైటీ డ్రెస్‌లు, పలు అభరాణాలు కూడా రెడీ చేసేస్తూ నెటిజన్లను ఆశ్చర్య పరుస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల ఏఐ ట్రెండ్ విచ్చలవిడిగా మారింది. దీనిని కొందరు మంచికి వాడితే మరికొందరు మాత్రం చెడుకి ఉపయోగిస్తున్నారు. తాజాగా, క్రిస్టినా ఎర్నెస్ట్ అనే మహిళ ఏఐతో రొబోటిక్ పాములను జోడించి డ్రెస్‌ను రెడీ చేసింది. అవి కదుతులూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ డ్రెస్ తయారు చేసిన వీడియోలను క్రిస్టినా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి.

అందులో నలుపు రంగులో ఉన్న గౌన్‌పై పాములు కదులుతూ కనిపిస్తున్నాయి. అయితే దీనిని ‘మెడుసా డ్రెస్’ అని పిలుస్తారట. మెడ చుట్టూ ఒక పాము ఉండగా.. నడుము చుట్టుతా మూడు బంగారు రంగులో ఉన్న సర్పాలు కనిపించాయి. అయితే మనల్ని చూస్తున్న వారి సైడ్ చూసేలా పాములను డిజైన్ చేసినట్లు క్రిస్టినా తెలిపింది. అలాగే రోటేటింగ్ మోటర్ పెట్టి, వైర్స్, కంట్రోలర్‌తో చేశాను. ఇదే వరల్డ్ ఫస్ట్ ఏఐ డ్రెస్ అని చెప్పుకొచ్చింది. అలాగే ఫాయిల్ స్నేక్ తన ఫేవరెట్ కాబట్టి పాములను పెట్టినట్లు వివరించింది. ప్రజెంట్ క్రిస్టినా రేడీ చేసిన డ్రెస్‌కు సంబంధించిన వీడియో చూసిన వారంతా ఆమె టాలెంట్‌కు ఫిదా అయిపోయి ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరు మాత్రం ఇదేం వింత డ్రెస్ అని అంటున్నారు.


Similar News