Viral : ఎవరూ లేరనుకుని వర్షంలో డాబాపైకి వెళ్లిన లవర్స్.. ఆ పని చేస్తుండగా ఎవరో వచ్చి..
ఈ మధ్య యువత వెరైటీ కోసం రిస్క్ చేయడం, బహిరంగ ప్రదేశాల్లో ప్రేమికులు హద్దులు మీరడం, బైకుల మీద స్టంట్లు చేయడం వంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి.
దిశ, ఫీచర్స్ : ఈ మధ్య యువత వెరైటీ కోసం రిస్క్ చేయడం, బహిరంగ ప్రదేశాల్లో ప్రేమికులు హద్దులు మీరడం, బైకులమీద స్టంట్లు చేయడం వంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. కొందరు వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారుతున్నాయి. అలాంటి ఓ ఆసక్తికర సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వైరల్ సమాచారం ప్రకారం.. వర్షం పడుతుండగా ఓ యువతి డాబాపైకి వెళ్లింది. వానలో తడుస్తూ ఎంజాయ్ చేస్తోంది. అంతలోనే పక్కనే ఉన్న మరో మేడపైకి ఆమె ప్రియుడు కూడా వచ్చాడు. అతన్ని చూడగానే దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే మధ్యలో గోడ అడ్డుగా ఉండటంతో దానిపైకి ఎక్కి మరీ అతనిన్ని ముద్దుల్లో ముంచెత్తింది సదరు ప్రియురాలు. అలా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇద్దరూ కిస్ చేసుకుంటూ ఎంజాయ్ చేశారు. ఓ వ్యక్తి ఈ సన్నివేశాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా, నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. జనాలు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు.. అంటూ కొందరు. ఇవేం పాడుపనులు కొంచెం హద్దుల్లో ఉంటే మంచిదంటూ మరి కొందరు స్పందిస్తున్నారు.