మహారాష్ట్రలో ఆశ్యర్యకర ఘటన!.. రోడ్డు మీద సంచరించిన మొసలి

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మొసలి రోడ్డుపైకి వచ్చి సంచరించిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

Update: 2024-07-01 05:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మొసలి రోడ్డుపైకి వచ్చి సంచరించిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. రత్నగిరి జిల్లాలోని తీరప్రాంతమైన చిప్లూన్ పరిసరాల్లో నిన్న రాత్రి ఓ మొసలి పక్కనే ఉన్న నది నుంచి బయటకి వచ్చింది. వాహానాలు తిరుగుతున్న సమయంలో రద్దీగా ఉన్న రోడ్లపైకి వచ్చి సంచరించింది. మొసలిని చూసిన ప్రజలు ఆశ్చర్యంతో పాటు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటనను తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

మహారాష్ట్రలోని తీర ప్రాంతమైన రత్నగిరి మగ్గర్ మొసళ్లకు ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని మూడు మొసలి జాతుల్లో మగ్గర్ కూడా ఒకటి. రత్నగిరి జిల్లాలోని చిప్లూన్ పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సముద్రం ఉప్పోంగుతుంది. ఈ భారీ వర్షాలకు పక్కనే శివ నది నీటి మట్టం పెరిగింది. మొసళ్లకు ఆవాసంగా ఉన్న శివ నది నుంచి ఈ మొసలి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మొసళ్లు రోడ్లపైకి వచ్చి సంచరించడం ఇదివరకు ఎప్పుడు జరగలేదని, మొసళ్లు జనావాసంలోకి రాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని తీర ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Similar News