టిక్‌టాక్‌తో జాతీయ భద్రతకు ముప్పు.. మరో దేశం కీలక ప్రకటన
దిశ, నేషనల్ బ్యూరో : చైనీస్ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌పై తైవాన్ కీలక ప్రకటన చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో : చైనీస్ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌పై తైవాన్ కీలక ప్రకటన చేసింది. ఆ యాప్ తమ జాతీయ భద్రతకు ముప్పుగా మారిందని తైవాన్ డిజిటల్ వ్యవహారాల మంత్రి ఆడ్రీ టాంగ్ అధికారికంగా ప్రకటించారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విదేశీ శత్రువుల నియంత్రణలో పనిచేసే ఏ రకమైన సాంకేతిక ఉత్పత్తి అయినా ప్రమాదకరమైందే అని ఆమె వెల్లడించారు. తైవాన్ జాతీయ సమాచారం, కమ్యూనికేషన్ వ్యవస్థలకు పెనుముప్పుగా పరిణమించిన మాధ్యమంగా టిక్‌టాక్‌ను గుర్తించామన్నారు. ఇటీవల తైవాన్ పార్లమెంటు సమావేశాల్లో టిక్‌టాక్‌ను ప్రమాదకరమైన సోషల్ మీడియా వ్యవస్థగా వర్గీకరించామని ఆడ్రీ టాంగ్ తెలిపారు.