Sri Lanka : శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు షాక్.. ఏమైందంటే.. ?
దిశ, నేషనల్ బ్యూరో : శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు చుక్కెదురైంది.
దిశ, నేషనల్ బ్యూరో : శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు చుక్కెదురైంది. ఈ ఏడాది సెప్టెంబరు 21న జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని రణిల్ భావిస్తున్నప్పటికీ.. అందుకు మద్దతు ఇచ్చే ఆసక్తి తమకు లేదని పార్లమెంటులోని అతిపెద్ద రాజకీయ పార్టీ శ్రీలంక పోదుజన పెరమునా (ఎస్ఎల్‌పీపీ) ప్రకటించింది. పార్లమెంటులో అత్యధిక మెజారిటీ తమకే ఉన్నందున.. ఈసారి దేశ అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థినే నిలపాలని నిర్ణయించిట్లు వెల్లడించింది. ఈవివరాలను ఎస్ఎల్‌పీపీ జనరల్ సెక్రెటరీ సలాగ కరియావాసం విలేకరులకు తెలిపారు. అయినా అధ్యక్ష ఎన్నికలపై రణిల్ విక్రమసింఘే ఇంకా ఆశలు వదులుకోలేదు. ఎస్ఎల్‌పీపీ పార్టీలోని మరో పక్షానికి చెందిన ప్రజాప్రతినిధుల మద్దతు తనకే లభించే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. దేశంలోని మైనారిటీ వర్గాల పార్టీలు కూడా తన వెంటే నడుస్తాయని రణిల్ విక్రమసింఘే అంచనా వేస్తున్నారు.