37 మంది భారత జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ

శ్రీలంక జలాల్లోకి ప్రవేశించారన్న కారణంతో ఆదివారం రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం 37 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసి, ఐదు పడవలను స్వాధీనం చేసుకుంది.

Update: 2023-10-29 06:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీలంక జలాల్లోకి ప్రవేశించారన్న కారణంతో ఆదివారం రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం 37 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసి, ఐదు పడవలను స్వాధీనం చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీలంక జలాల్లో చైనా నేవీ గూఢచారి నౌక సంచరిస్తుందన్న అనుమానంతో ఆ దేశ నౌకాదళం పెట్రోలింగ్ ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే శ్రీలంక నావికా దళ బృందాలు తలైమన్నార్ సమీపంలో చేపలు పట్టేందుకు రామేశ్వరం నుంచి వచ్చిన 23 మంది భారతీయ మత్స్యకారులను చుట్టుముట్టాయి. తలైమన్నార్ నేవీ క్యాంపుకు తరలించే ముందు వారిని అరెస్ట్ చేసి, మొత్తం మూడు పడవలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నెడుంతీవు సమీపంలో 14 మంది మత్స్యకారులను అరెస్ట్ చేసి, వారి రెండు పడవలను స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News