Sheikh Hasina : ఇంకొంత కాలం భారత్‌లోనే షేక్ హసీనా.. కుమారుడు సజీబ్ ప్రకటన

దిశ, నేషనల్ బ్యూరో : షేక్ హసీనా ఏ దేశంలో ఉండబోతున్నారు ? అనే దానిపై ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ కీలక ప్రకటన చేశారు.

Update: 2024-08-07 12:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో : షేక్ హసీనా ఏ దేశంలో ఉండబోతున్నారు ? అనే దానిపై ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ కీలక ప్రకటన చేశారు. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి భారత్‌కు చేరుకున్న షేక్ హసీనా ఇంకొంత కాలం ఢిల్లీలోనే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. బుధవారం జర్మనీ ప్రభుత్వ మీడియా సంస్థ డాయిష్ వెల్లీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవివరాలను సజీబ్ తెలియజేశారు. ‘‘ఏదైనా దేశంలో ఆశ్రయం పొందేందుకు షేక్ హసీనా ప్రయత్నిస్తున్నారా ?’’ అని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ‘‘ప్రస్తుతం హసీనా అలాంటి ఆలోచన చేయడం లేదు’’ అని ఆయన తేల్చి చెప్పారు. ‘‘ఢిల్లీలో హసీనా ఒంటరిగా లేరు. ఆమె సోదరి రేహానా కూడా ఢిల్లీలోనే ఉన్నారు’’ అని సజీబ్ చెప్పారు. బంగ్లాదేశ్, భారత్ మినహా మూడో దేశానికి హసీనా వెళ్లిపోతారని జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమని ఆయన పేర్కొన్నారు. హసీనా సోదరి రేహానా లేదా మరెవరైనా కుటుంబ సభ్యులు బంగ్లాదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందా అని సజీబ్‌ను ప్రశ్నించగా.. ‘‘మా కుటుంబానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు జరగడం ఇది మూడోసారి. అందుకే హసీనా మినహా ఆమె కుటుంబ సభ్యులంతా విదేశాల్లోనే స్థిరపడ్డారు’’ అని బదులిచ్చారు.

డబ్ల్యూహెచ్‌వోలో కీలక హోదాలో హసీనా కుమార్తె

షేక్ హసీనా కుమార్తె సల్మా వాజెద్ ఢిల్లీలోనే ఉన్నారు. ఆమె ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆగ్నేయాసియా రీజియనల్ డైెరెక్టర్ హోదాలో పనిచేస్తున్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆగ్నేయాసియా విభాగం కార్యాలయం ఢిల్లీలోనే ఉంది. షేక్ హసీనా సోదరి షేక్ రేహానా కుమార్తె తులీప్ సిద్దిఖీ ప్రస్తుతం బ్రిటీష్ ఎంపీగా ఉన్నారు. హసీనాకు యూకేలో ఆశ్రయం కల్పించాలని తులీప్ సిద్దిఖీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆమెకు ఆశ్రయం కల్పించేందుకు యూకే ప్రభుత్వం నో చెప్పింది. 

Tags:    

Similar News