ప్రధానిగా షేక్ హసీనా ప్రమాణ స్వీకారం

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా గురువారం ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

Update: 2024-01-11 16:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా గురువారం ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 76 ఏళ్ల షేక్ హసీనాతో దేశ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ ప్రమాణం చేయించారు. “చట్ట ప్రకారం ప్రధానమంత్రి బాధ్యతలను నిష్ఠతో నిర్వర్తిస్తాను’’ అంటూ షేక్ హసీనా బాధ్యతలు చేపట్టారు. ప్రధానితో పాటు కొత్త మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ అఖండ విజయం సాధించింది. 300 మంది సభ్యులున్న బంగ్లాదేశ్ పార్లమెంటులో షేక్‌ హసీనా పార్టీ 223 సీట్లను గెల్చుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ), దాని మిత్రపక్షాలు సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించడంతో ఈసారి ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. బీఎన్‌పీ పిలుపు మేరకు జనం ఓట్లు వేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ఎన్నికల్లో 40 శాతం పోలింగే నమోదైంది. దేశంలోని 12 కోట్ల మంది ఓటర్లలో 5 కోట్ల కంటే తక్కువ మందే ఓట్లు వేశారు.

Tags:    

Similar News