Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన ఖరారు

రష్యా అధ్యక్షుడు పుతిన్(Vladimir Putin) భారత పర్యటన ఖరారైంది. ఈ విషయాన్ని రష్యా ప్రతినిధి ప్రకటించారు.

Update: 2024-11-19 10:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: రష్యా అధ్యక్షుడు పుతిన్(Vladimir Putin) భారత పర్యటన ఖరారైంది. ఈ విషయాన్ని రష్యా ప్రతినిధి ప్రకటించారు. అతి త్వరలో పుతిన్ భారత్‌లో పర్యటిస్తారని మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. కానీ తేదీలను మాత్రం ప్రకటించలేదు. కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్‌(India)కు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరోవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ మొదలుపెట్టి 1000 రోజులు పూర్తయిన వేళ ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.

అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే కీలక దస్త్రంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే, దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని అందులో పేర్కొన్నారు. తాము అందించే దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతించిన వేళ పుతిన్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Tags:    

Similar News