పుతిన్‌కు షాకిచ్చిన రష్యన్ వ్యామోగాములు! ఆ బట్టలేసుకున్నారు..?! (వీడియో)
ఎవరికి ఇష్టం వచ్చింది వారు వేసుకునే వెసులుబాటు ఉంటుందని.. Russian cosmonauts give shock to Putin.
దిశ, వెబ్‌డెస్క్ః ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్దాన్ని నిరసిస్తూ అంతర్జాతీయంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు, రష్యాపై ఆంక్షలు పెంచితే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూల్చేస్తామంటూ రష్యా ఇటీవల హెచ్చిరికలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సంఘటన రష్యా ప్రభుత్వానికి షాకిచ్చింది. ఉక్రెయిన్‌కు సంఘీభావమో, అనుకోకుండా జరిగిన వ్యవహారమో తెలియదు గానీ రష్యన్ ఆస్ట్రోనాట్‌లు పుతిన్ పరువు తీశారు. రష్యాకు చెందిన ముగ్గురు వ్యోమగాములు ఉక్రేనియన్ జెండాకు సరిపోయే పసుపు, నీలం రంగులతో ఉన్న ఫ్లైట్ సూట్‌లు ధరించి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత అంతరిక్ష కేంద్రంలోకి తాజాగా వచ్చిన మొదటి వ్యక్తులు ఈ రష్యన్ వ్యోమోగాములే.
స్పేస్ స్టేషన్‌తో కలపడానికి క్యాప్సూల్‌ను సిద్ధం చేస్తున్నప్పుడు తీసిన వీడియోలో రష్యన్ వ్యోమగాములు బ్లూ కలర్ ఫ్లైట్ సూట్‌ను ధరించారు. అయితే, అంతరిక్ష కేంద్రానికి చేరినప్పుడు వాళ్లు పసుపు యూనిఫామ్‌లో కనిపించడంపై అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యింది. అయితే, ఈ చర్య ఏదైనా సందేశం పంపడానికి ఉద్దేశించిందా లేదా అనే విషయం అస్పష్టంగానే ఉంది. ఈ కాస్మోనాట్‌లు స్పేస్‌లోకి వెళ్లిన తర్వాత భూమిపై ఉన్న కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో ఒలేగ్ ఆర్టెమ్యేవ్ అనే ఆస్ట్రోనాట్‌ను మారిన సూట్‌ల గురించి అడిగారు. అందుబాటులో ఉన్న వివిధ రంగుల సూట్లలో వ్యక్తిగతంగా ఎవరికి ఇష్టం వచ్చింది వారు వేసుకునే వెసులుబాటు ఉంటుందని, తాము పసుపు రంగును ఎంచుకున్నాము అని వాళ్లు సమాధానం చెప్పారు.
ఇక, శుక్రవారం (11:55 a.m. EDT) బయలుదేరిన సోయుజ్ ఎమ్ ఎస్-21 కేవలం మూడు గంటల వ్యవధిలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సజావుగా చేరుకోగా, ఇద్దరు రష్యన్లు, నలుగురు అమెరికన్లు, ఒక జర్మన్‌ను కక్ష్యలో ఉన్న అవుట్‌పోస్ట్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం రష్యాన్లు ధరించిన ఈ సూట్ల వీడియో మీడియాలో వైరల్ అయ్యింది.