ఉక్రెయిన్‌తో యుద్ధంలో భారీ విజయం సాధించిన రష్యా
ఉక్రెయిన్‌తో జరుగుతున్న సుదీర్ఘ యుద్ధంలో రష్యా భారీ విజయం సాధించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని కీలకమైన నగరమైన అవ్‌దివ్కా నగరాన్ని రష్యా సంపూర్ణంగా ఆక్రమించింది.
దిశ, వెబ్‌డెస్క్: ఉక్రెయిన్‌తో జరుగుతున్న సుదీర్ఘ యుద్ధంలో రష్యా భారీ విజయం సాధించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని కీలకమైన నగరమైన అవ్‌దివ్కా నగరాన్ని రష్యా సంపూర్ణంగా ఆక్రమించింది. ఈ సందర్భంగా అవ్‌దివ్కా నగరంలోని భారీ భవనాలపై తమ దేశ జెండాలు ఎగరేసింది రష్యా. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను రష్యా ఆదివారం అధికారికంగా విడుదల చేసి, ప్రకటించింది. అయితే, అవ్‌దివ్కా నగరంలో దాదాపు నాలుగు పాటు పోరాడి ఉక్రెయిన్ సైన్య వెనక్కి తగ్గింది. ఉక్రెయిన్‌పై రెండేళ్లుగా యుద్ధం చేస్తోన్న రష్యా. కాగా, 2022 ఫిబ్రవరి 24న, ఉక్రెయిన్‌పై పెద్ద ఎత్తున యుద్ధం ప్రారంభించింది రష్యా. NATO(ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంఘము)లో చేరకుండా ఉక్రెయిన్‌ను చట్టబద్ధంగా నిషేధించాలని రష్యా డిమాండ్ చేసింది.