Russia : రష్యన్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. 8 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు

రష్యాలోని వోల్గోగ్రాడ్ ప్రాంతంలోని ఓ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకొని 8 మంది మృతి చందిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-08-24 21:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: రష్యాలోని వోల్గోగ్రాడ్ ప్రాంతంలోని ఓ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకొని 8 మంది మృతి చందిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వీరిలో నలుగురు జైలు సిబ్బంది కూడా మరణించారు. కొంత మంది ఖైదీలు కత్తుల పట్టుకొని తాము ఇస్లామిక్ స్టేట్ (ISIS) కు సంబంధించిన వారంటూ రచ్చ చేశారు. కొందరు ఇతర ఖైదీలను బెదిరిస్తూ జైలులో కొంత ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని హల్ చల్ చేశారు.ముస్లింలను హింసించినందుకు ప్రతీకారంగా ఈ దాడి చేశామని వారు పేర్కొన్నారు. ఒక సాధారణ క్రమశిక్షణ సమావేశం జరుగుతుండగా ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్లు ఒక నివేదిక తెలిపింది .

వివరాల్లోకెళ్తే రామ్‌జిదిన్ తోషెవ్ (28) రుస్తామ్‌చోన్ నవ్రూజీ (23), నజిర్చోన్ తోషోవ్ (28) , టెమూర్ ఖుసినోవ్ (29) అనే నలుగురు ఖైదీల బృందం క్రమశిక్షణ సమావేశం జరుగుతుండ విచక్షణారహితంగా జైలులోని గార్డులను కత్తులతో నరికి, అనేకమందిని గాయపరిచారు.కాగా ఈ ఘర్షణకు సంబంధించి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అందులో జైలు గార్డుపై ఖైదీ కత్తి పట్టుకోవడం కనిపిస్తోంది.మరొక వీడియో జైలు యార్డ్‌లో దాడి చేసిన వారిని చూపిస్తుంది. పరిస్థితి తీవ్రతరం కావడంతో, రోస్గ్వార్డియా నేషనల్ గార్డ్‌కు చెందిన భారీ సాయుధ దళాలు, ఎలైట్ స్నిపర్‌లతో సహా రష్యన్ ప్రత్యేక దళాలు సంఘటనా స్థలానికి చేరుకొని దాడి చేస్తున్న వారిని ముట్టడించాయి .ఈ క్రమంలో దాడి చేసిన నలుగురిని స్నిపర్లు కాల్చి చంపారు. దాడి చేసినవారు విడుదల చేసిన వీడియోలలో వారు ISISకి తమ విధేయతగా ప్రతిజ్ఞ చేశారు. కాగా దాడి చేసిన వారు ఉజ్బెకిస్తాన్ , తజికిస్థాన్ దేశాలకు చెందిన పౌరులుగా జైలు అధికారులు గుర్తించారు. 


Similar News