థాయ్‌లాండ్‌లో వింత పాము కలకలం! డ్రాగన్‌లా డేంజర్ లుక్!! (వీడియో)
ప్రతి వింత ఘటన వెనుక ఓ చారిత్రక పరిణామం మాత్రం ఉంటుంది. Puff-Faced Grass Green Snake found in Thailand Province.
దిశ, వెబ్‌డెస్క్ః ఈ అనంత ప్రకృతిలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి సంభవిస్తుందో చెప్పడం కష్టమే. అయితే, ప్రతి వింత ఘటన వెనుక ఓ చారిత్రక పరిణామం మాత్రం ఉంటుంది. కొత్తగా థాయ్‌లాండ్‌లో ఓ వింత పాము కలకలం రేపుతోంది. ఇది అచ్చం మంగోలియన్ల సంస్కృతిలో భాగమైన డ్రాగన్‌లా ఉండటం మరింత ఆశ్చర్యం గొలిపే విశేషంగా అంతా చెప్పుకుంటున్నారు. థాయ్‌లాండ్‌లోని బురదనీటిలో గడ్డిలాంటి బొచ్చుతో ఉన్న ఓ ఆకుపచ్చ పాము ఒకటి కనిపించింది. ఇంతకు ముందెన్నడూ అలాంటి జంతువును చూడని స్థానికులు దాన్ని చూసి భయపడ్డారు. ఈశాన్య థాయ్‌లాండ్‌లోని సఖోన్ నఖోన్ ప్రావిన్స్‌లో నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న తూ అనే 49 ఏళ్ల వ్యక్తికి ఈ వింత పాము కనిపించింది. ఇంతకుముందు ఎప్పుడూ చూడని పాము కావడంతో పామును పట్టి, ఓ పాత్రలో దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. రెండడుగులు ఉన్న ఈ పాము గురించి అధికారులకు చెప్పారు. ఇంటిలో ఉన్నంత సేపు చిన్న చిన్న చేపలను దానికి ఆహారంగా వేయగా, పాము తినేసింది.
ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి పామును చూడకపోవడం. ఇదివరకు ఇంకెవరైనా ఇలాంటి జీవిని చూసారేమో తెలుసుకొని, పరిశోధనలకు ఏమైనా వినియోగించుకోవచ్చనే ఉద్దేశంతో దీన్ని ఇంటిలో ఉంచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీని ఫోటోలు, వీడియోలను తీసి, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా, చాలా మంది ఇది డ్రాగన్‌లా కనిపిస్తుందని అనడంతో మరో కోణం వెలుగులోకి వచ్చింది. కొందరు దాని చర్మంపైన నాచు, ఆల్గే పెరుగుతుందని అన్నారు. 'వైల్డ్‌లైఫ్ ఆర్క్' పాము జాతుల సమన్వయకర్త అయిన శామ్ చాట్‌ఫీల్డ్ ఈ పాము గురించి మాట్లాడుతూ, ఈ జీవి పొలుసులపైన పెరుగుతున్న ఆల్గే వల్ల ఉబ్బినట్లు కనిపించే ఓ నీటి పాము కావచ్చని అన్నారు. ఇక, ఇలాంటి పఫ్-ఫేస్డ్ వాటర్ స్నేక్‌లు స్వల్పంగా విషపూరితమైనవని, ప్రధానంగా ఆగ్నేయాసియాలో కనిపిస్తాయని అన్నారు.